ఇవాళ నేతలు ఏం చేస్తున్నారంటే…

      కొత్త-పాత అనే తేడాలేదు. అంతా న్యూ ఇయర్ జోష్ లో ఉన్నారు. కానీ సిఎం చంద్రబాబునాయుడు పనిలో పడ్డారు. కనకదుర్గ గుడి, టీటీడీ దేవాలయ అర్చకులు ఉదయాన్ని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనతో పాటు…అధికారులకు ఆశీర్వచనాలు పలికారు. కొత్త సంవత్సర వేడుకలు వద్దని చెప్పినా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు చంద్రబాబు నివాసానికి బారులు తీరారు. ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు పనిలో పడ్డారు. 
బిజీ బిజీగా చంద్రబాబు
       నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2018 మరింత అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం లేదని, ఈ సమయంలో అద్భుత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. స్ఫూర్తిదాయక సమయంలో పనిచేయడం గొప్ప సంతృప్తిని ఇస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 
పాదయాత్రలో జగన్
        న్యూ ఇయర్ ప్రారంభం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోనహనరెడ్డి 49వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది జగన్ పాదయాత్ర. ముదివేడు నుంచి ప్రారంభమైన యాత్ర కడప క్రాస్‌రోడ్డు‌, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్‌ రోడ్స్ మీదుగా సీటీఎం వరకు కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు టీటీడీ అర్చకుల సమక్షంలో వేంకటేశ్వరస్వామికి జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. 
అన్నదాతకు 24 గంటల కరెంట్ తో కేసీఆర్
        నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు సి.ఎం కేసీఆర్. వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటలపాటు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించిన ఆనందంలో ఉన్నారు కేసీఆర్. తెలంగాణ పంటపొలాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. రాష్ట్రంలోని 23లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరంట్ సరఫరాను విద్యుత్ సంస్థలు ప్రారంభించాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ చేయలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేయడం విశేషమే. రాజ్ భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు గవర్నర్ నరసింహన్. వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బిజీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో నయా జోష్ తక్కువగా ఉండగా..తెలంగాణలో ఆలయాలకు క్యూ కట్టారు జనాలు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.