పవన్ దానికి ఓకే అంటే.. టీడీపీ, వైసీపీకి కష్టాలే

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. అధికార, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో పార్టీలన్నీ స్పీడు పెంచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అనుకుంటోంది. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గత ఎన్నికల్లో సైకిల్‌కు జై కొట్టిన ఓటర్లు.. ఈ సారి తమ వైపు చూస్తారని ఆశగా ఉన్నారు. వీటికి తోడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని భావిస్తున్నాయి. అందుకోసం ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో చాలా పార్టీలు గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీని కలవరపాటుకు గురి చేసే ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అయితే, ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనపై ఆధారపడి ఉందట.

గత ఎన్నికలకు ఇప్పటికీ ఉన్న తేడా ఒక్కటే.. అదే జనసేన పార్టీ. 2014లో జరిగిన ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి, పోటీకి దూరంగా ఉన్న ఆ పార్టీ.. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని చూస్తోంది. అందుకోసం ఎన్నో ప్లాన్లు సిద్ధం చేసుకుంటోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాత్రను కూడా ముగించేశాడు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించేశాడు. ఇందుకోసం జిల్లాల వారీగా కమిటీలను కూడా వేస్తున్నాడు. ఇదిలాఉండగా, జనసేన పార్టీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇదే కనుక అప్లై చేస్తే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు కష్టాలు తప్పవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబితాలు విడుదల చేస్తే.. ఆ రెండు పార్టీల నుంచి జనసేనలోకి వలసలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో టికెట్ దక్కదనే భావనలో ఉన్న నేతలతో మంతనాలు జరపడానికి ఓ కమిటీ వేయాలని పలువురు సీనియర్లు పవన్‌కు సలహా ఇస్తున్నారట. దీనికి పవన్ ఓకే చెప్పేస్తే టీడీపీ, వైసీపీకి కష్టాలు ఇప్పటి నుంచే మొదలవుతాయనే టాక్ వినిపిస్తోంది. మరి జనసేనాని ఎలాంటి స్టెప్ వేస్తాడో చూడాలి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.