ప్రముఖ నటుడు వినోద్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టు తన విలక్షన నటనతో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ప్రముఖ సినీ నటుడు వినోద్ అలియాస్ అరిశెట్టి నాగేశ్వరరావు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు ఈరోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు పలువురు సినీ ప్రముఖులు వినోద్ స్వగృహానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. వినోద్‌కు భార్య వీనావతి, ముగ్గురు పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు.
ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వినోద్ నటనపై ఉన్న మక్కువతో 1980లో సినీ రంగ ప్రవేశం చేశారు. వీ విశ్వేశ్వరరావు డైరెక్షన్‌లో వచ్చిన కీర్తి కాంత కనకం సినిమా ద్వారా ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఆ సినిమాలో వినోద్ హీరోగా నటించారు. ఇందులో అత్యుత్తమ నటన కనబరచడంతో వినోద్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. నల్లత్రాచు, లారీ డ్రైవర్, చంటి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. మొత్తంగా మూడు వందల పైచిలుకు సినిమాల్లో నటించిన వినోద్.. తమిళంలోనూ 28 సినిమాలతో పాటు, రెండు హిందీ చిత్రాల్లో నటించారు. కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లతెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.