చిరంజీవి అల్లుడి సినిమా టీజర్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ‘విజేత‌’ సినిమా టీజర్ వచ్చేసింది. వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ సరసన మాళవికా నాయర్ నటిస్తోంది. వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా.. టీజ‌ర్‌ను చిత్రబృందం కొద్దిసేపటి క్రితం విడుద‌ల చేసింది. విడుదలైన కొద్ది సమయంలోనే ఈ టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. మెగా అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తేన్నారు.

ఇక టీజర్ విషయానికొస్తే… ఇది చూస్తున్నంతసేపు పాత సినిమా టీజర్‌ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ తరహా హీరోయిజాన్ని చాలా సినిమాల్లో చూసేశాం. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి హీరో కథలు చాలానే వచ్చాయి. అయితే ఇందులో చాలా మంది ఈ తరహా కథలతోనే హిట్ కొట్టారు కూడా. అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’, రెండేళ్ల కిందట ధనుష్ ‘రఘువరన్ బీటెక్’, రీసెంట్‌గా ‘నీది నాదీ ఒకే కథ’లో ఈ తరహా హీరోయిజాన్ని చూశాం. ఆ సినిమాల లాగానే ఈ టీజర్‌ను చూస్తే కథ అర్థమైపోతుంది.

అన్నీ సమకూర్చి పెట్టే తల్లిదండ్రులు.. చదువు విషయంలోనో, ఉద్యోగం విషయంలోనో హీరోలు రాజీ పడకపోవడం.. తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయలేకపోవడం.. ప్రీ క్లైమాక్స్‌లో ఏదో ముఖ్యమైనది కోల్పోవడం.. చివరకు అందరి చేత శభాష్ అనిపించుకునే పనేదో చేయడం.. హీరోకు సపోర్టుగా ఒక ప్రేమించే అమ్మాయి.. ఇది కూడా ఆ కోవకు చెందిన కథే అనిపించకమానదు. మరి, మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రమైన విజేత సినిమా టైటిల్‌ను పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.