బాబు ఢిల్లీ టూర్ కు ముందే కౌంటర్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కింగ్ విజయమాల్యాతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. 2016 మార్చి 12,13,14 తేదిల్లో లండన్ కు వెళ్లిన చంద్రబాబు అక్కడ విజయ్ మాల్యాను కలిశారని విమర్శించారు. ఇంత వరకు చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు. మాల్యా దేశం వదలి వెళ్లిన పది రోజులకు చంద్రబాబు కలిసింది నిజం కాదాయని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. మరోవైపు చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసులు ఇచ్చింది వైకాపా. 
యూటర్న్‌ అంకుల్‌ అని చంద్రబాబును పదే పదే పిలుస్తోంది వైకాపా. ఆ పదాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో జాతీయ నేతలతో మాట్లాడితే ఆ మేరకు ఆయనకు మైలేజ్ పెరుగుతోంది. అది వైకాపాకు ఇబ్బంది కలిగించే అంశమే. అందుకే కావాలని చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారనే వాదన సాగుతోంది. చంద్రబాబు ఢిల్లీకి రాకుండానే ఆయనపై ఎదురుదాడి చేస్తోంది వైకాపా. ఓటుకు నోట్లు కేసు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని చెబుతోంది చంద్రబాబు లక్ష కోట్లకు పైగా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. 
మరోవైపు వైకాపా, బీజేపీ బంధాన్ని బయట పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఏ కాస్త అవకాశం దొరికినా వదలడం లేదు. చంద్రబాబును చంపాలి. ఉరితీయాలని గతంలో జగన్ చేసిన ఆరోపణలు బూమ్ రాంగ్ అయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు తల్లిదండ్రుల పైనా వ్యాఖ్యలు చేసారు. అది మర్చిపోక ముందే లిక్కర్ డాన్ తో బాబుకు సంబంధాలు ఉన్నాయని చెప్పడం హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.