విజ‌య‌సాయి ఏందీది…..

ఎన్నిక‌ల‌కు ఇంకా యేడాది స‌మ‌యం ఉన్న ఏపీలో మాత్రం  రాజ‌కీయ‌పార్టీల మ‌ధ్య ర‌గ‌డ మొద‌లైంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు ఏ మాత్రం త‌గ్గ‌కుండా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అరోగ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు అయితే ఎవ‌రూ పెద్ద‌గాప‌ట్టించుకోరు. రాజ‌కీయాలు అన్న‌ప్పుడు ఆ మాత్రం ఆరోప‌ణ‌లు ఉండ‌క‌పోతే ఏం రంజుగా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు కూడా అనుకుంటారు. అయితే ఇది కాస్త చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌ల‌కు దారి తీస్తోంది. ఎవ‌రికి వారు త‌మ ప‌ట్టు సాధించుకోవ‌డానికో లేక మీడియాలో ఎక్స్‌పోజ్ అవ్వ‌డానికో  తెలియ‌దు గాని స్థాయి మ‌రిచి మ‌రీ పిచ్చి ప్రేలాప‌న‌లు చేస్తున్నారు. ఇలాంటి విష‌యాల‌ను చ‌ర్చించుకునేందుకు ప్ర‌జ‌లు కూడా కాస్త ఇబ్బందిగానే ఫీల‌వుతున్నారు. బీజేపీ, టీడీపీమ‌ద్య మైతీ బందం తెగ‌డం, ఏపీ ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం హాట్ టాపిగ్ మారింది. ఇదే త‌రుణం అనుకున్న వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లిలో దూకుడు పెంచాడు. గ‌తంలో ఏపీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి “ఒక అమ్మకి, ఒక అబ్బకి పుట్టుంటే…” అంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకి దారితీశాయి.
బీజేపీతో మైత్రీ కుదుర్చుకునేందుకు విజ‌య‌సాయి బాబుపై కావాల‌నే ఇలాంటి కామెంట్ చేశాడ‌ని రాజ‌కీయ పండితులుచ‌ర్చించుకున్నారు. తాజాగా నిప్పునాయుడు, ప‌ప్పునాయుడు అంటూ చంద్ర‌బాబు, లోకేష్‌ల గురించి సాయిరెడ్డి వ్యాఖ్యానించాడు. ఇవి సోష‌ల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యాల‌పై శ్రుతిమించిన బూతుల‌తో సోష‌ల్‌మీడియాలో తిట్టుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి వ్యవహారశైలిపై ఏపీలో ర‌క‌ర‌కాల‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఓట్లు అడగటానికి వచ్చిన రామనాథ్ కోవింద్ కాళ్లమీద పడటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటాలు సాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి ప్రాపకం కోసం ఆత్రపడటం, పీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేయడం, రాజ్యసభలో ఆయన పాదాలు తాకే ప్రయత్నం చేయడం వంటి అంశాలన్నీ ఏపీ ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. హుందాతనాన్ని విడిచి  విజయసాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారేంటని కొందరు లోతుగా చర్చిస్తున్నారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో అయినా విజయసాయి తన వ్యవహారశైలిని మార్చుకుంటారో లేదో..! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.