బాబు పై వ్యక్తిగత దాడి చేసిన విజయసాయిరెడ్డి 

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు పెంచారు. ఎంతగా అంటే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబునాయుడు వచ్చినా తాము సిద్ధమేనని చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో ఎందుకు మంతనాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. పేరుకు అవిశ్వాస డ్రామా ఆడుతూ లోపాయికారిగా బీజేపీతో మంతనాలు చేస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలకు… వైకాపా నేత అదే తీరులో సమాధానం చెప్పడం హాట్ టాపికైంది.
సీఎం రమేశ్‌ బండారాన్ని బయటపెడతాం. ఉత్తరాఖండ్‌లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాడు. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేశాడని విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. ఇలాంటి దొంగలా మాపై విమర్శలు చేసేది?.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు… అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాతో నన్ను పోల్చుతారా? అంటూ ప్రశ్నించారు. 
నేను ఇప్పటివరకు ఏ ఒక్క బ్యాంక్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారు. మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ మధ్యకాలంలో వైకాపా నేతలు ఇంతగా చంద్రబాబుపై దాడి చేసిన దాఖలాలు లేవు. జైలుకు వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి తమపై మాటల దాడి చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. 

7 Comments

  1. విజయసాయిరెడ్డి గారికి కోపం వచ్చింది అంటే, మరి రాదా? ఆయనను విజయమాల్యతో సరిపోల్చారు. ఇది దారుణం కాదా? సుమారు 5వేల కోట్లు అప్పు బ్యాంకుల నుంచి తీసుకుని, వ్యాపారంచేసి, వడ్డీలు ఇంకో 4వేల కోట్లతో కలిపి మొత్తం బాకీ 9వేల కోట్లు అయినంత మాత్రానికే పిరికివాడిలా దేశం వదిలి పారిపోయిన మాల్యాకు, సుమారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ లో 2నెం. ముద్దాయిగా వుండి, దేశంలోనే, ప్రధాని కార్యాలయంలో దర్జాగా తిరుగుతున్న సింహంలాంటి సాయిరెడ్డికి పోలిక ఏమిటి? ఇంతకంటే దారుణమైన పోలిక ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కాబట్టే శ్రీవారికి కోపం వచ్చింది. తనకు తెలిసిన నీచమైన భాష, సంస్కారంతో ఎదుటి వ్యక్తిని కన్నవాళ్లను అమ్మానా బూతులు తిట్టాడు, ఆయనకు జన్మతః వచ్చ్చిన విద్యాలన్నీ ప్రదర్శిస్తున్నాడు. భావి తరాలకు ఒక అద్భుతమైన, ఆదర్శనీయమైన జీవిత బాటను ఏర్పాటు చేస్తున్నాడు. సమాజంలోని వ్యక్తులందరూ తమ సంతానానికి ఈ మహనుభావుడిని ఆదర్శంగా చూపించి, మనిషి అనేవాడు ధైర్యంగా దొంగలెక్కలు రాసి, సమాజాన్ని దోచుకుని, డబ్బు సంపాదించాలి, పట్టుబడితే కాళ్ళు పట్టుకుని ఎలా బయటపడాలో తెలియచెప్పాలి. పిల్లల పుస్తకాలలో ఈయన జీవితచరిత్రను పాఠ్యఅంశంగా చేర్చి, అద్భుతమైనవిజయాలను ఆదుకోవాలి. లేకుంటే మన దేశం ప్రపంచంలో వెనుకబడిపోతుంది.

  2. “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమాలో చెప్పినట్లు, గర్భగుడిలోని దేవుని ప్రతిమ మీద వీధికుక్క మూత్రం విడిచినంత మాత్రాన దేవుడికి వచ్చ్చిన నష్టం ఏమీలేదు. ఆ కుక్క బుద్ధి మాత్రం ప్రపంచానికి తెలిసింది. ఈ విషయంలో కూడా అదే జరిగింది.

  3. enti aa matalu oka donga MP ayithe vadiki samskaram emi vuntundhi asalu athaniki pm office lo enti pani elanti valu MP lu ayyinanduku siggu padutunam kanisam basha anna bagundali mee abiprayam meeru cheppandi tappu ledu kani thalli dandrini anatam emi samskaram dhanini malli ee YCP valu support cheyadam chee .

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.