కర్తవ్యం’కోసం వస్తున్న విజయశాంతి

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని తెలుగునాట విజయశాంతి నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో అగ్ర తారగా కీర్తి సంపాదించారు. తరువాత రాజకీయాల్లో కూడా అంతే చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత నంబర్ 2 పొజిషన్ లో కూడా కనిపించారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల నేపధ్యంలో కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి టీఆర్ ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న విజయశాంతి తాజాగా 2019 ఎన్నికల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి, అనంతరం విభేదాలతో కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మనస్థాపం చెందిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు  2019 ఎన్నికల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి విజయశాంతి రెడీ అవుతున్నారని సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా వ్యవహరించడానికి విజయశాంతి రెడీ అయ్యారని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం విజయశాంతి ప్రాతినిధ్యం వహించిన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే మళ్లీ విజయశాంతి రీఎంట్రీతో అక్కడ గ్రూపు రాజకీయాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ శక్తియాప్ పరిశీలన కార్యక్రమం మెదక్ లో నిర్వహించగా విజయశాంతి, శశిధర్ రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొన్నట్ల తేలింది. తాజాగా విజయశాంతి తాను మళ్లీ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు చెప్పారట! అధిష్టానం కూడా దీనికి సమ్మతి తెలిపిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయశాంతి సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెకు ప్రచార కమిటీ బాధ్యతలు కూడా అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కాగా విజయశాంతి మెదక్ లేదా పటాన్ చెరు నుంచి పోటీచేయాలని యోచిస్తున్నారట! మరి విజయశాంతి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎంతరవకూ ఢీకొట్టగలరో వేచి చూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.