బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్యగా ‘డర్టీపిక్చర్’ హీరోయిన్

మహా నటుడు ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలియగానే అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎవరు చేస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ పక్కన రెండుమూడు సినిమాల్లో మెప్పించిన నయనతారే బసవతారకం పాత్ర చేయబోతోందని తొలుత వార్తలు వినిపించినా.. ఆ పాత్రకు ఓ బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్లు తాజాగా తెలుస్తోంది.

20వ శతాబ్దానికి ముందు తెలుగు వాళ్లను ఎంతగానో ఆకట్టుకున్న శృంగారతార సిల్క్‌స్మిత బయోపిక్‌గా వచ్చిన ‘డర్టీపిక్చర్’ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రకు ఎంపిక చేశారట. జూలై రెండో వారం నుంచి ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్‌లో నిజంగానే విద్యాబాలన్‌కు అవకాశం వస్తే ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించాలన్న ఆమె కోరిక ఎట్టకేలకు ఈ చిత్రంతో నెరవేరుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో అతి కీలకమైన ఏపీ సీఎం చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రానా పోషించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే రానా ఈ చిత్రంలో ఉన్నాడా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటుల ఎంపికలో బాలయ్య, క్రిష్ బిజీగా ఉన్నారు. నూతన నటీనటులకు కూడా ఈ సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.