మోడీ, విహెచ్ పి మధ్య పెరుగుతున్న అంతరం

ప్రధాని మోడీ, విహెచ్ పికి మధ్య రచ్చ మొదలైంది. ఫలితంగా బిజెపికి దగ్గరగా ఉండే విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ అద్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశాడు. బిజెపిని ప్రదాని మోడీని ఇరుకున పడేసేలా ఆయన మాటలు ఉన్నాయి. ప్రధాని మోడీతో తొగాడియాకు విబేధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అందుకే ఆయనను అరెస్టు చేయడానికి రాజస్తాన్ ,గుజరాత్ పోలీసులు ప్రయత్నాలు చేశారనే ప్రచారం సాగుతోంది. గుజరాత్ లో బిజెపికి మెజార్టీ తగ్గడం వెనుక తొగాడియా పాత్ర ఉందని మోడీ అనుకూల వర్గం భావిస్తోందట. మాటి మాటికి రామమందిరం, గోరక్షా, లవ్‌ జీహాద్‌లపై వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఆందోళన చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలోని కొందరికి ఇది ఇష్టం లేదని వీహెచ్‌పీ ప్రతినిధి, తొగాడియా అనుచరుడు జైషా ప్రకటించారు. అందుకే తొగాడియాను వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి తప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అది విఫలం కావడంతో ఏకంగా కేసులను అడ్డుపెట్టుకుని చంపాలని చూస్తున్నారని ఆరోపించారాయన. ఫలితంగా ఇంటి గుట్టు బయట పటినట్లు అయింది.  రాజస్తాన్,గుజరాత్ లలో బీజేపి ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా విశ్వహిందూపరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియాను అవి ఎందుకు వెంటాడుతున్నాయని కాంగ్రెస్ అడిగిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆయన్ను ఎందుకు అరెస్టు చేస్తున్నాయని ప్రశ్నించారాయన. తొగాడియా చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ డిమాండ్‌ చేశారు. పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కూడా ప్రవీణ్ తొగాడియాను పరామర్శించడం విశేషం. బిజెపి నేతలు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా కలకలం రేపుతోంది. తనను ఎవరు, ఎందుకు చంపాలనుకుంటున్నారో తొగాడియానే చెప్పాల్సి ఉందని ఆర్‌ఎ్‌సఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫలితంగా ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్, బీజేపీల మధ్య సయోధ్య చర్చలు జరుగుతున్నాయి. తొందరగా అవి సమసిపోక పోతే బీజేపీకి వ్యతిరేకంగా జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. ప్రధాని మోడీ చేసే ప్రతి పనిని తాము సమర్థించేది లేదంటున్నారు విహెచ్ పి నేతలు. అందుకే విభేదాలు మరింతగా పెరిగాయని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.