వ‌సంత‌.. ఏమిటీ కిరాయి సంత‌!

వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ప‌రిచ‌యం అక్క‌ర్లేని నేత‌. పార్టీలు మారుతూ.. మ‌రోసారి తానో.. త‌న పుత్ర‌ర‌త్న‌మో.. ఎవ‌రో ఒక‌రు మ‌ళ్లీ చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అందుకే.. టీడీపీ నుంచి కాంగ్రెస్ త‌రువాత వైసీపీ త‌రువాత టీడీపీ.. ఇప్పుడు మ‌ళ్లీ ఫ్యాన్ కింద‌కు చేరారు. 2004 ముందు వ‌ర‌కూ సైలెంట్‌గానే ఉన్న మాజీ మంత్రి వ‌సంత‌ను దేవినేని కుటుంబం బాగానే వెంటాడింది. నందిగామ బ‌రి నుంచి పోటీచేసినా మూడుసార్లు.. దేవినేని ర‌మ‌ణ‌, ఉమ చేతిలో తండ్రి వ‌సంత నాగేశ్వ‌రరావు, కొడుకు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఓట‌మి చ‌విచూశారు. దీనికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నే ఆలోచ‌న‌తో దేవినేని ఉమాపై గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా.. కేడ‌ర్ లేక‌పోవ‌టం. కృష్ణ‌ప్ర‌సాద్ వ్యాపారాల‌తో రాజ‌కీయానుభ‌వం లేక‌పోవ‌టం వంటి అంశాల‌న్నీ వారిని గెలుపుగుర్రం వ‌ర‌కూ చేర్చ‌లేక‌పోతున్నాయి. కొద్దికాలం టీడీపీలో కొన‌సాగినా.. ఇమ‌డ‌లేక‌పోయారు. ఇదే స‌మ‌యంలో పార్టీలో వ‌సంత కుటుంబంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతూ వ‌చ్చింది. దీంతో పార్టీ కార్య‌క‌లాపాలకు దూరంగా ఉంచారు.
ఈనేప‌ధ్యంలోనే మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరారీ తండ్రీత‌న‌యులు. నందిగామ ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌టంతో మైల‌వ‌రంపై దృష్టిపెట్టారు. జ‌గ‌న్ నుంచి హామీతెచ్చుకుని మైల‌వ‌రంలో మ‌కాం వేశారు. ఇర‌వైఏళ్లుగా దేవినేనిపై పెంచుకున్న ప‌గ‌కు గెలిచి ప్ర‌తీకారం  తీర్చుకోవాల‌నే ధోర‌ణిలో కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసుకుంటున్నారు. మైల‌వ‌రంలో దేవినేని ఉమాకు మంచి సపోర్టు ఉంది. పైగా తాగు, సాగునీటి విష‌యంలో బాగానే ప‌నిచేశారు. అయితే.. అవినీతి ముద్ర‌, అయిన‌వారికే ప్రాధాన్య‌త‌నిస్తార‌నే కొన్ని ప్ర‌తికూల‌త‌లూ ఉన్నాయి. ఏమైనా అక్క‌డ దేవినేని బ‌ల‌ప‌డ‌టంతో.. అదే సామాజిక‌వ‌ర్గం కావ‌టంతో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు వైసీపీ అవ‌కాశం ఇచ్చింది. దీంతో అక్క‌డ పోస్ట‌ర్లు, ఫ్లెక్సీల‌తో వ‌సంత వ‌ర్గం హ‌ల్‌చ‌ల్ ప్రారంభించింది. ఇప్ప‌టికే ఉప్పు, నిప్పుగా ఉన్న వ‌సంత వ‌ర్సెస్ దేవినేని వ‌ర్గాల మ‌ధ్య ర‌చ్చ తారాస్థాయికి చేరింది. దీనిపై గుంటుప‌ల్లి పంచాయ‌తీ సెక్ర‌ట‌రీకు ఫోన్‌చేసిన వ‌సంత నాగేశ్వ‌ర‌రావు బెదిరింపులు దిగాడు. పైగా.. దేవినేని ఏమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చ‌రించారు. క‌డ‌ప నుంచి మ‌నుషుల‌ను దించుతామ‌ని బెదిరించారు. అధికారితో మీ పిల్ల‌లు ఎక్క‌డ చ‌దువుతున్నారంటూ బ్లాక్‌మెయిలింగ్ ధోర‌ణికీ దిగాడు. దీంతో ఖంగుతిన్న అధికారి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో కేసు న‌మోదుచేశారు. విష‌య‌మైన స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబునాయుడు ఆగ్ర‌హం వెలిబుచ్చారు. రౌడీ రాజ‌కీయాల‌తో ఏకంగా మంత్రినే హ‌త్య చేస్తామ‌నేంత‌కు బ‌రితెగించ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి పున‌రావృతం గాకుండా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. ఎన్నిక‌లు ఆరు నెల‌ల ముందుగానే.. రాజ‌కీయాలు ఇంత‌గా ర‌గులుతుంటే ఆ స‌మ‌యంలో ఇంకెంత‌గా దారితీస్తాయ‌నే ఆందోళ‌న కూడా జ‌నంలో నెల‌కొంది. ఇది టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ గా మారితే.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితులు త‌ప్ప‌వంటూ పోలీసువ‌ర్గాలు భావిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.