నివురుగప్పిన నిప్పులా వంగవీటి

వైకాపాలో విజయవాడ అంతర్గత సంక్షోభం ఇంకా చల్లారలేదంటున్నారు. తనకు సీటు ఎక్కడ ఇస్తారనే విషయంపై జగన్ ఇంకా వంగవీటికి క్లారిటీ ఇవ్వలేదట. వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా కలిసి తనసీటు గురించి అడిగారట. ఇందుకు ఆయన నుంచి సరైన సమాధానం రాలేదంటున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తననుకాదని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులకు సీట్లు ఇస్తే తన పరిస్థితి ఏంటని అడుగుతున్నారట. కానీ జగన్ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు దావోస్ పర్యటన తర్వాత టీడీపీలోకి వంగవీటి చేరతారనే ప్రచారం వచ్చినా అది సద్దుమణిగింది. అయినా సరే టీడీపీ నేతలతో వంగవీటి ఇప్పుడు బాగా టచ్ లో ఉన్నారట. 
కాకపోతే రాధా ఒప్పుకుంటే మచిలీపట్టణం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోగ్యం బాగోలేదని అందుకే వంగవీటిని అక్కడకి పంపే ఆలోచన చేస్తుందట. ఎంపీకి అయ్యే ఖర్చును పెట్టుకునేందుకు టీడీపీ ఓకే చేయాలని అడుగుతున్నారట వంగవీటి. కనీసం రూ.60 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు అయ్యే వీలుంది. అంత డబ్బులు తాను పెట్టలేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే వీలుందంటున్నారు. 
ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాత వంగవీటి వైకాపాను వీడటం ఖాయమంటున్నారు. ఆ పార్టీ నేతలు తనను గౌరవంచడం లేదనే భావనలో వంగవీటి ఉన్నారని తెలుస్తోంది. అందుకే అక్కడ ఇమడలేక పార్టీ మారుతాడంటున్నారు అనుచరులు. ఎన్నికల వేళ ఏదైనా జరిగే అవకాశముంది.   

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.