మానాన్నను చంపిన పార్టీకి నేను వెళ్లను… వంగవీటి

విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారనే ప్రచారం వచ్చింది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అనుచరులు బాగానే ప్రచారం చేశారు. విజయవాడకు చెందిన మరో వైసీపీ నేత  గౌతమ్‌రెడ్డితో రాధకు విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు సీట్ల విషయంలో జగన్ ఆయనకు హామీనివ్వలేదంటారు. అందుకే తన అనుచరులతో మాట్లాడి పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే వాదనలు వచ్చాయి. మరోవైపు ఆయనతో జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. 
              కానీ ఇ్పపుడు ఈ వార్త‌ల‌పై  వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్పందించారు. `మా నాన్నని చంపిన టీడీపీలోకి నేనెందుకు జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సినంత ఖర్మ పట్టలేదు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. జ‌గ‌న్ తన సోదరుడని చెప్పారు. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పడంతో పుకార్లు ఎలా వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. 2019లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిచి కృష్ణాజిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పడం హాట్ టాపికైంది. 
                 నిప్పు లేనిదే పొగ రాదు. కానీ పార్టీ మారేందుకు సిద్దమైన వంగవీటి ఈ లోపు వెనక్కు తగ్గాడా అనే చర్చ సాగుతోంది. బుజ్జగింపులు పెరగడంతో పాటు.. గట్టిహామీ వచ్చిందని.. అందుకే కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట వంగవీటి. వైకాపా నేతలు అంబటి, ఉమ్మారెడ్డితో పాటు కాపు నేతలు కొందరు వంగవీటి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడారంటున్నారు. ఫలితంగా అతను మెత్తబడ్డారని తెలుస్తోంది. అందుకే జగన్ కు అనుకూలంగా మాట్లాడారని చెబుతున్నారు. ఏదైనా ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.