వ‌ల‌స నేత‌లు ఉంటారా! వెళ‌తారా!

ఎన్నిక‌ల వేళ ముంచుకువ‌స్తోంది. ఎవ‌రికి వారు.. త‌మ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై అంచ‌నాలు వేసుకునే ప‌నిలో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ వంటి రాజ‌కీయ చైత‌న్యం గ‌ల రాష్ట్ర నేత‌లు.. ఒక కోయిల ముందే కూసింది అన్న‌ట్లుగా హ‌డావుడి చేస్తున్నారు. ఓ విధంగా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే.. గెలిచే పార్టీ వైపు వెళితే.. రేప‌టిరోజున గిట్టుబాటు అవుతుంద‌నే ధోర‌ణితో ఆచితూచి అడుగులేస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ సీనియ‌ర్లు.. ఒక‌రు దానం.. గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఇక రెండోనేత‌.. ముఖేష్‌గౌడ్ కూడా మంత‌నాల ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇక‌.. ఒక‌ప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ నేత‌గా ఉన్నారు. ఆయ‌నపై స్వ‌యంగా నిజామాబాద్ ఎంపీ క‌విత తండ్రికి ఫిర్యాదు చేసింది. బీజేపీలో త‌న కొడుకు కొమ్ముకాస్తూ.. పార్టీకు చెడ్డ‌పేరు తెస్తున్నాడ‌ని ఆమె అభియోగం. అజాద్ వంటి కాంగ్రెస్ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ భ‌రించ‌లేని ఆరోప‌ణ‌. ఫ‌లితంగా డీఎస్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రావ‌చ్చ‌ని స‌మాచారం.

అటు ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డాల‌ని.. క‌నీసం రెండంకెల సీట్ల‌యినా గెలుచుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంది. ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో మంత‌నాలు చేస్తూ.. దాదాపు హ‌స్తం గూటికి చేరేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా చంద్ర‌బాబు మాట‌ల‌తో శాంతించినా వేరు కుంప‌టి వైపు చూస్తున్నార‌నే తెలుస్తుంది. ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వైసీపీలోకి దాదాపు చేరిన‌ట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ్యోతుల‌నెహ్రు, క‌ర‌ణం బ‌ల‌రాం, వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి టీడీపీ ఎమ్మెల్యేలకూ.. ప‌లు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్న‌ట్లు స‌మాచారం. జేసీ దివాక‌ర్‌రెడ్డి కూడా తన‌కు, కొడుకు ప‌వ‌న్‌కు సీట్లు కేటాయించ‌కుంటే.. రాజీనామా త‌ప్ప‌దంటూ త‌న వ‌ర్గం వారి వ‌ద్ద చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో కూడా వ‌ల‌స నేత‌లు, టీడీపీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుద‌ర‌క‌.. త‌ర‌చూ గొడ‌వ‌ల‌తో రోడ్డున‌ప‌డ‌తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రికి సీటు ఉంటుంది.. ఎవ‌రు నామినేటెడ్ ప‌ద‌వులు ఆశ‌చూపుతార‌నే అంశంపై కూడా నేత‌లు అనుచ‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. దీంతో దాదాపూ అన్ని పార్టీలకూ బుజ్జ‌గింపులు, ఊర‌డింపులు పెద్ద స‌మ‌స్య కానున్నాయి. ఇది టీడీపీలో మ‌రింత అధికంగా ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి. దీంతో టీడీపీలో ఉన్న వ‌ల‌స నేత‌లు ఎంద‌రుంటారు.. ఎంద‌రు బ‌య‌ట‌కు వెళ‌తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.