విభజన చట్టంపై ఉండవల్లితో బాబు కీలక భేటీ

రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు విభిన్న ధ్రువాలైన ఏపీ సీఎం చంద్రబాబు, మాజి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ తలుపులు మూసి అక్రమంగా రాష్ట్రాన్ని విడగొట్టారంటూ ఉండవల్లి చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు. చివరకు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వ్యాజ్యం దాఖలు చేసి న్యాయపరంగానూ విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సీఎం సైతం స్పందించి కలిసి రావాలంటూ రెండు సార్లు ఆయనకు లేఖ కూడా రాశారు. దాంతో పాటు రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయాన పార్లమెంట్‌లో ఎటువంటి పరిస్థితులున్నాయి..? అసలు నిబంధనల ప్రకారం అది ఆమోదం పొందిందా..? వంటి విషయాలపై సుప్రీంలో స్పష్టంగా వివరించేందుకు సపోర్టు డ్యాకుమెంట్లు కూడా సమర్పించారు. తాజాగా బడ్జెట్‌ సమావేశాల సమయంలో తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారంటూ సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సైతం జోడించి మరీ కోర్టుకు నివేదించారు. మరోవైపు అవిశ్వాసం నోటీసులు ఎన్ని సార్లు ఇస్తున్నా పట్టించుకోని కేంద్రం వైఖరిని ఉద్దేశించి అటు విభజనపై నిబంధనల మేర జరగలేదని, కనీసం హామీల అమలు కూడా లేదని.. ఈ రెండు అంశాలపై పోరాడేందుకు చంద్రబాబు కలిసి రావాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. దాదాపు మూడు నెలల తరువాత దీనిపై స్పందించిన చంద్రబాబు దీనిపై చర్చించేందుకు ఉండవల్లిని ఆహ్వానించారు. దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్య భవిష్యత్తులో లోక్‌సభలో ఎలా ముందుకెళ్లాలి, అటు న్యాయస్థానంలో ఎలా స్పందించాలి అనే అంశాలపై చర్చ జరిగినట్లు ఉండవల్లి నమస్తే ఆంధ్రకు వివరించారు. విభజన చట్ట ఆమోదం, పార్లమెంట్‌ వ్యవహారాలపై చంద్రబాబు కొన్ని సందేహాలను లేవనెత్తగా వాటిని నివృతి చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన డ్యాంకుమెంట్లు సైతం బాబుకు అందించానని, మరిన్ని వివరాలు కూడా ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దానితోపాటు ఆదివారం ఢిల్లీకి వెళ్లి టీడీపీ పార్లమెంటరీ పార్టీతో చర్చించి కేంద్రంపై పోరుకు భవిష్యత్తు కార్యచరణ నిర్ణయించబోతున్నట్లు వివరించారు. అలసు చంద్రబాబును తాను కలవడం ఇది తొలిసారి ఉండవల్లి చెప్పడం కొసమెరుపుగా నిలిచింది.

1 Comment

  1. Undavalli is clever politician and fighting for AP. CBN did right thing to consult him and take valuable inputs in fight against Centre.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.