ఉండవల్లి లేఖతో కలకలం

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజనపై చర్చకు నోటీసులు ఇవ్వాలని ఆ లేఖలో ప్రస్తావించారు. చర్చ జరిగితేనే ఏపీకి న్యాయం జరుగుతోంది. హోదానా.. ప్యాకేజినా.. విభజన హామీలను అమలు చేయడామా ఇంకొకటినా బయటకు వస్తోంది. అలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అని ఆ లేఖలో ప్రస్తావించారు ఉండవల్లి. ఇందుకు గతంలో ఉన్న సంగతులను గుర్తు చేశారాయన.
1972లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంపై 1978లో పార్లమెంటులో చర్చ జరిగిన సంగతిని ఉండవల్లి చంద్రబాబుకు గుర్తు చేశారు. మెజార్టీ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా విభజన జరిగిందనేది నిజం. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ విభజన చట్టాన్ని సోనియాగాంధీ ప్రభుత్వం ఆమోదించింది. కాబట్టే ఏపీలో ఆ పార్టీని ఆదరించలేదు కాంగ్రెస్. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెబుతోంది కాంగ్రెస్. అందుకే ఇప్పుడు విభజన పార్లమెంటు సమావేశాల్లో చర్చించవచ్చునన్నారు. విభజన జరిగిందని చెబుతున్నా పార్లమెంటు ప్రొసీడింగ్స్ లో ఆ విషయమే లేదు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యులు కాదు కాబట్టి నోటీసు ఇవ్వవచ్చన్నారు. అలాగే  ఏపీ విభజనకు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు తాను టీడీపీ నేతల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదంటున్నారాయన. మొత్తంగా టీడీపీని ఇరుకున పెట్టే పని చేస్తున్నా.. ఏపీ కోసమే అంటున్నారు ఉండవల్లి. టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది కాబట్టే అడుగుతున్నట్లు చెప్పారు ఉండవల్లి. 
మరోవైపు ఉండవల్లి లేఖ పై టీడీపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. హోదానే కాదు.. ఏపీకి న్యాయం చేసేందుకే తాము పోరాడుతున్నట్లు చెబుతోంది టీడీపీ. కాబట్టి ఉండవల్లి లేఖను సానుకూలంగా తీసుకునే వీలుందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.