అక్కడి ఎన్నికల పోరులో పోటీ లేని కాంగ్రెస్ నేత

తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అచ్చంపేటలో పోరు రసవత్తరంగా సాగనుందనే అంచనాలున్నాయి. ఈ నియోజకవర్గంలో సత్తాచాటాలని ఒకవైపు టీఆర్ఎస్ ప్రయత్నాలు సాగిస్తుండగా, ఇటు మహాకూటమి నేతలు కూడా గెలుపే ధ్యేయంగా చెమటోడుస్తున్నారని భోగట్టా. అచ్చంపేట కాంగ్రెస్‍ అభ్యర్థిగా వంశీకృష్ణ ఖాయమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్‍ఎస్‍ అభ్యర్థి, సిట్టింగ్‍ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నాటికే అచ్చంపేట మొత్తంలో ఒక దఫాలో ప్రచారం పూర్తిచేశారు. రాబోయే ఎన్నికల్లో ఈ ఇరువురి మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారని భోగట్టా. గత 2014 సాధారణ ఎన్నికల్లో వంశీకృష్ణ, గువ్వల బాలరాజులు ఎన్నికల బరిలో పోటీపడ్డారు. అయితే బాలరాజును విజయం వరించింది. 2014 ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం మొత్తం మీద 1,46,768 ఓట్లు పోలవగా, టీఆర్‍ఎస్‍ అభ్యర్థి గువ్వల బాలరాజుకు 62,584 ఓట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్‍ అభ్యర్థి వంశీ కృష్ణ 50,764 ఓట్ల వచ్చి రెండో స్థానంలో సరిపెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి మధ్య హోరాహోరి పోరు కొనసాగే అవకాశం స్పష్టంగా ఉంటుందని భోగట్టా. ఇప్పటికే అధికార పార్టీ, సిట్టింగ్‍ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గంలో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతూ, తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తున్నారని భోగట్టా. అలాగే అచ్చంపేట నియోజకవర్గంలో కేసీఆర్‍ ప్రవేశపెట్టన సంక్షేమ పథకాలే తనకు మరోసారి విజయాన్ని అందిస్తాయని గువ్వల బాలరాజు దీమా వ్యక్తంచేస్తున్నారని భోగట్టా. అయితే కాంగ్రెస్‍ తమ అభ్యర్థిని ఈనాటికీ అధికారికంగా ప్రకటించలేదు. దీనికితోడు ఇక్కడ టికెట్‍ ఆశించే వ్యక్తి మరొకరు లేకపోవడంతో, వంశీకృష్ణనే కాంగ్రెస్‍ అభ్యర్థి అని స్పష్టమవుతోందంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన నెలరోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే సిట్టింగ్‍ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈసారి ఆయనపై ప్రజా తిరుగుబాటు తప్పదని వంశీకృష్ణ అంటున్నట్టు భోగట్టా. మరోవైపు బీజెపి కూడా అచ్చంపేట నియోజకవర్గానికి మొదటి జాబితాలోనే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సివిల్‍ కాంట్రాక్టర్‍ మేడిపూర్‍ మల్లేశ్వర్‍ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. మల్లేశ్వర్‍ స్థానికుడు కావడంతొ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఏతావాతా చూసుకుంటే అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍, బీజేపి, మూడు పార్టీల మధ్య ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. మరి అచ్చంపేట ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవాలంటే వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.