వ‌సంతా… ఏందీ సంత‌!

రాజ‌కీయ చైత‌న్యానికి కీల‌కం కృష్ణాజిల్లా.. గెలుపోట‌ముల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి.. మూడు చెరువులు తాగించ‌టంలో ఆక్క‌డి నేత‌ల స్ట‌యిలే వేరు. సామాజికంగా.. ఆర్ధికంగా.. ఉద్య‌మ ప‌రంగా  కూడా ముఖ్య‌మైన నేత‌లంతా. అక్క‌డ నుంచే వ‌చ్చారు.  మ‌రి అటువంటి చోట రాజకీయాలెప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. ఇప్పుడు నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకున్న ప‌రిణామాలు.. భ‌లే ఆస‌క్తిక‌రంగా మారాయి. దీని ప్ర‌భావం జిల్లాకే కాదు.. యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నూ ప్ర‌భావితం చేసేవి కావ‌టమే దీనికి ప్ర‌ధాన కార‌ణం. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు.. ఎన్‌టీఆర్ ప్ర‌భుత్వంలో హోంమంత్రిగా, వ్య‌వ‌సాయ మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్‌. ఓ విధంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు త‌న‌కు తెలిసిన వార‌ని పేరు పెట్టి పిల‌వ‌గ‌ల నేత . అటువంటి నేత‌కు.. రాజ‌కీయంగా ఓ కోరిక మిగిలింది. అదే.. దేవినేని కుటుంబాన్ని ఓడించాలి. వీలైతే.. ఓట‌మిలో తాను భాగం కావాలి.. ఇప్ప‌టి నుంచి కాదు.. 2004 నుంచి ఇదే పంథా.. అందుకే కాంగ్రెస్ హ‌యాంలో వ‌సంత నాగేశ్వ‌రావు, ఈయ‌న త‌న‌యుడు కృష్ణ‌ప్ర‌సాద్ ఇద్ద‌రూ.  రెండుసార్లు పోటీచేసి మ‌రీ ఓడారు. ఎందుకంటే.. దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్యేగా. మంత్రిగా.. అక్క‌డ చేసిన కార్య‌క్ర‌మాలు.. మ‌రో పాతికేళ్ల వ‌ర‌కూ టీడీపీను ఓట‌మి లేకుండా చేశాయ‌నే చెప్పాలి.
ఇటువంటి చోట‌.. వ‌సంత పాగా వేయాల‌నుకోవ‌టం హాస్యాస్ప‌ద‌మే. పైగా ఇప్పుడు నందిగామ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడు కూడా. ఈ మ‌ధ్య‌లోనే.. వ‌సంత కుమారుడితో క‌ల‌సి రెండు పార్టీలు మారి.. చివ‌ర‌కు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ.. అక్క‌డ ఏం జ‌రిగిందో కొద్ది రోజులక్రిత‌మే.. వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని ఉమాకు ధీటుగా.. వ‌సంత‌కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేసి గెల‌వాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌సంత నాగేశ్వ‌రరావు. మంత్రి ఉమాపై ఘాటైన కామెంట్స్ చేశారు. ర‌మ‌ణ మ‌ర‌ణం త‌రువాత‌.. వ‌దిన ప్ర‌ణీత‌ను చంపాడంటూ ఉమాపై విమ‌ర్శ‌లు జొప్పించాడు. పైగా వంగ‌వీటి రంగా హ‌త్యోదంతంలో  ఉమా పాత్ర ఉందంటూ సంచ‌ల‌నం రేకెత్తించాడు. దీని వెనుక కేవ‌లం రాజ‌కీయంగా ఉమాపై పై చేయి సాధించేందుకేనంటూ టీడీపీ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ సైలెంట్‌గా జ‌రిగిన వార్‌.. ఇక న‌డిరోడ్డుపై మొద‌లైన‌ట్టుగానే పార్టీలు భావిస్తున్నాయి.
మూడు ద‌శాబ్దాల నాటి విష‌యాల‌ను తిరిగి బ‌య‌ట‌కు తీసి.. కులాల మ‌ధ్య చిచ్చు పెట్టి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు వ‌సంత‌.. ఇలాంటి సంత పెడ‌తున్నారంటూ వైసీపీలోనూ వ్య‌తిరేక‌త మొద‌ల‌వ‌టం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రి దీన్నుంచి వ‌సంత ఎటువంటి ల‌బ్డి పొందుతార‌నేది అటుంచితే.. ఉమాపై వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ నెగ్గ‌టం.. అంత తేలికైన ప‌ని కాదంటూ.. వ‌సంత‌కు సొంత వారే.. హిత‌వు  చెబుతున్నార‌ట‌.. ఇక‌పోతే. టీడీపీ నేత‌లైతే.. తండ్రి కొడుకులు.. ఇద్ద‌రూ ఓడినా.. మ‌రోసారి ఉమా చేతిలో ఓట‌మికి ఉబ‌లాట‌ప‌డుతున్నారంట ఎద్దేవాచేస్తున్నారు. దీని వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంది.. నాలుగు ద‌ఫాలుగా.. ఆశ‌ప‌డుతున్న గెలుపు.. వ‌సంత కుటుంబానికి ద‌క్క‌క‌పోతే.. ఇక అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిపోతుంద‌నే భ‌యం కూడా.. తండ్రీకొడుకుల‌ను ఇబ్బందిపెడుతున్న‌ట్లు స‌మాచారం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.