మోడీ ప‌రువు లండ‌న్లో పోయింది!

మాటంటే విదేశాల్లో తిరిగే మోడీ చివ‌ర‌కు ప‌ర‌దేశీయుల ద్వారానే భార‌తీయుల పరువు తీశాడు. నిన్న‌టి బ్రిటిష్ పార్ల‌మెంటులో జ‌రిగిన సంఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. చివ‌ర‌కు వాళ్ల‌తో కూడా తిట్టించావా మోడీ అంటూ ఇండియ‌న్లు మోడీని ఆడిపోసుకుంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ప్రపంచంలోనే అతిపెద్ద విగ్ర‌హ‌మైన ప‌టేల్ విగ్ర‌హాన్ని ఇటీవల గుజరాత్ లో మోడీ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటుతో మోడీ ప్ర‌తిష్ట‌, భార‌త ప్ర‌తిష్ట ఇనుమ‌డిస్తాయ‌ని మోడీ, బీజేపీ భావించాయి. కానీ చివ‌ర‌కు అది జ‌ర‌గ‌క‌పోగా మోడీపై బాగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
సర్దార్ గొప్పదనం మాకు తెలియ‌దా?… మూడు వేల కోట్లు ప‌టేల్ పేరిట ఓ విద్యా ప‌థ‌కం పెట్టి స‌ద్వినియోగం చేయొచ్చని కొంద‌రు అంటే… పేద‌లు ఆక‌లితో చ‌స్తుంటే… ఇన్నివేల కోట్లు విగ్ర‌హాల‌కు పెడ‌తారా అని కొంద‌ర‌న్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ప్ర‌పంచంలోనే పెద్ద విగ్ర‌హం అని అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు రాయ‌డంతో అది చూసిన బ్రిటన్ ఎంపీ భారత చర్యను తప్పుప‌డుతూ కామెంట్ చేసింది. భారత్ కు వివిధ పథకాల కోసం బ్రిట‌న్ ప్ర‌భుత్వం రూ.9,492 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. భార‌త్ అభివృద్ధి కోసం వాడ‌తారు అనుకుంటే… భార‌త ప్ర‌భుత్వానికి నిధులు బాగా ఎక్కువ‌గానే ఉన్న‌ట్టున్నాయి. కేవ‌లం ఒక్క విగ్ర‌హానికే మూడు వేల కోట్లు నిర్మించిందని కన్జర్వేటీవ్ పార్టీ ఎంపీ పీటర్ బోన్ త‌ప్పు ప‌ట్టారు. ఇది స‌రైన చ‌ర్య కాద‌న్నారు. భారత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె స్పంద‌న ఎన్నారైల‌లో, ఇండియాలో బాగా వైర‌ల్ అయ్యింది. విగ్ర‌హానికే 3 వేల కోట్లు ఖర్చు పెట్టే స్థోమ‌త భార‌త్‌కు ఉన్న‌పుడు బ‌హుశా ఇత‌రుల సాయం భార‌త్‌కు అవ‌స‌రం లేద‌నుకుంటాను అని కామెంట్ చేశారు. పీటర్ వాదనకు మరింత మంది ఎంపీలు కూడా మ‌ద్దతు ప‌లికారు.బ్రిట‌న్ ఎంపీ కామెంట్లు భ‌విష్య‌త్తులో ఇండియ‌న్ ఫండ్ రైజింగ్‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపే ప్ర‌మాదం లేక‌పోలేదు.
నిజానికి ఇలాంటి క‌ట్ట‌డాల వ‌ల్ల ప‌ర్యాట‌కం అభివృద్ధి చెంతుంది. ఇంత పెద్ద బ‌డ్జెట్‌తో చాలా ప‌ర్యాట‌క ప్రాజెక్టులు క‌ట్టొచ్చు. కేవ‌లం మోడీ త‌న ఇగో కోసం నిధుల‌ను స‌మ‌ర్థంగా స‌ద్వినియోగం చేయ‌లేక‌పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.