ఎన్టీఆర్ బయోపిక్‌లో ఇద్దరు ప్రముఖులకు చోటు

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ సినిమా జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’ అని, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాత్రలో దగ్గబాటి రానా, అక్కినేని పాత్రలో సుమంత్ సహా కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితర ప్రముఖులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మరో ఇద్దరు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లలో ఒకరు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కాగా, రెండో వ్యక్తి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు అద్భుతమైన మాటలను అందించిన సాయిమాధవ్‌కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కినట్లు సమాచారం. ఎన్టీఆర్‌కి వ్య‌క్తిగ‌త మేక‌ప్ మేన్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి పీతాంబ‌రం పాత్రనే ఆయన పోషించనున్నారని తెలుస్తోంది. ఈ పీతాంబరం ఎన్టీఆర్ సినిమాలను వదిలేసే వరకు ఆయనతోనే ప్రయాణం కొనసాగించారు. అంతేకాదు, తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎమ్జీఆర్‌కు తప్ప మరొకరికి మేకప్ వేయలేదు. అందుకే ఈయన పాత్రను బయోపిక్‌లో చూపించబోతున్నారట. అలాగే, కవిగా గుర్తింపు పొందిన డాక్టర్ సీ నారాయణరెడ్డి పాత్రలో రామజోగయ్య శాస్త్రి కనిపించబోతున్నారని తెలిసింది. కవిగా అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న నారాయణరెడ్డిని సినిమాల్లోకి రమ్మని, తొలి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్.. ఆయన ప్రతి సినిమాలోనూ పాటలు రాయించుకున్నారు. ఇంత అనుబంధం ఉంది కాబట్టే ఈ పాత్రను కూడా బయోపిక్‌లో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.