టీవీ9 బోగ‌స్ స‌ర్వే గుట్టుర‌ట్టు…తెలంగాణాలో 135 సీట్లు ఉన్నాయా టీవీ9 !

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎన్ని బోగ‌స్ స‌ర్వేలు వ‌స్తున్నాయో చెప్పే ఉదంతం ఇది. రాష్ట్రంలో నెంబ‌ర్ 1 ఛానల్ గా ఉన్న టీవీ9 సోమ‌వారం నాడు ప్ర‌సారం చేసిన స‌ర్వే ఎంత బోగ‌స్ అనేది ఈ లెక్క‌లు చెబుతున్నాయి. ఇది కేవ‌లం ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం చేశారో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇప్పుడు టీవీ9 యాజ‌మాన్యం కూడా ఎవ‌రి చేతుల్లో ఉందో అంద‌రికీ తెలుసు. అస‌లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఈ స‌ర్వే ప్ర‌సారం చేసిన‌ట్లు తేలిపోయింది. ఈ లెక్క‌లు చూస్తుంటే. కేవ‌లం తాము కోరుకున్న వారికి ప్ర‌యోజ‌నం చేకూర్చిపెట్ట‌డం కోసం రాష్ట్రంలో లేని అసెంబ్లీ సీట్ల‌ను కూడా టీవీ9 తీసుకొచ్చిందా?

లెక్క‌..ఇదెక్క‌డి స‌ర్వే. ఈ లెక్క‌ల‌తోనే ఇది ఎంత బోగ‌స్ భాగోత‌మే తేలిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌దే 119 అసెంబ్లీ సీట్లు. కానీ ఆ సంస్థ స‌ర్వేలో మాత్రం ఏకంగా సీట్ల లెక్క 135కి చేరింది. అది ఎలా సాధ్యం అవుతుంది. అంటే ఇది నిజంగా చేసిన స‌ర్వే కాదు…ఏదో ఓ గ‌దిలో కూర్చుని రాసిన లెక్క‌గానే తేలిపోతుంది.

ఆ లెక్క ఏంటో మీరూ చూడండి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓ లెక్క ప్ర‌కారం గ‌రిష్టంగా 104 సీట్లు వ‌స్తాయిన ఈ స‌ర్వేలో తేల్చారు.
కాంగ్రెస్ కూటమికి 22గా, బిజెపికి 2 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు, ఇత‌రుల‌కు 1 సీటు వ‌స్తుంద‌ని టీవీ9, సీపీఎస్ ప్రీ పోల్ స‌ర్వే చెప్పింది.

ఈ సీట్లు అన్నీ క‌లిపితే మొత్తం సంఖ్య 135 వ‌స్తుంది. కానీ తెలంగాణ‌లో ఉన్న‌ది కేవ‌లం 119 సీట్లు. మ‌రి 16 సీట్లు
ప‌క్క నున్న ఏపీ నుంచి అప్పు తెచ్చి క‌లిపారా?. అస‌లు ఇది ఎలా సాధ్యం. ఏ ప్రమాణాల ప్ర‌కారం ఇది శాస్త్రీయ స‌ర్వే అవుతుంది. ఈ స‌ర్వే లెక్క‌లు చూసి అంద‌రూ విస్తుపోయే ప‌రిస్థితి ఉంది. స‌ర్వే నిర్వాహ‌కులు చెబుతున్న శాంపిల్స్..స‌మ‌యం అన్నీ కూడా ప‌లు ప్ర‌శ్న‌లు లేవనెత్తుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సీట్ల సంఖ్య ఒక్క‌టి చాలు టీవీ9 సర్వేలో స‌త్తా ఎంతో తేల్చ‌టానికి. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ స‌ర్వే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అయితే లైవ్ లోనే ఇది బోగ‌స్ స‌ర్వే అని తేల్చిప‌డేశారు. ఏకంగా 119 సీట్లు ఉన్న చోట 135 సీట్ల లెక్క‌ల‌తో స‌ర్వే చేశారంటే ఇక అంత కంటే ఏమి కావాలి ఈ స‌ర్వే
గొప్ప‌త‌నం తేల్చ‌టానికి?.

2 Comments

  1. OREY PAGAL GA KONCHEM DIMAG KUDA LEDA
    SURVEY LO 94-104 ECHARU ANTE TRS KI TAGGITE VERE VALLAKU PERUGUTAYI
    TRS KI PERIGITE VERE VALLAKU TAGGUTHAYI
    ELANTI DIMAG LEKUNGA NEW RAYODDHU PAGAL GA

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.