గులాబీకి మూడు సీట్లు

రాజ్యసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించారు. ఫలితంగా కేసీఆర్ వ్యూహం ఫలించినట్లు అయింది. విప్ ధిక్కరించిన పార్టీ ఫిరాయింపుదార్లకు ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలపడం మరింత ఆశ్చర్యకరం. బీజేపీ, సిపిఎం, టీడీపీ ఓటింగ్ కు దూరంగా ఉండగా… మిగతా పార్టీలు ఓటింగ్ లో పాల్గొన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు కావడంతో వారు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.  
తెలంగాణలో మొత్తం 108 ఓట్లు పోలవ్వగా గులాబీ పార్టీ అభ్యర్థులు బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్యకు 32 ఓట్లు, జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు 32 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌కు కేవలం 10 ఓట్లు లభించాయి. ఆయనకు 11 ఓట్లు రావాల్సి ఉన్నప్పటికీ స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఓటును ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌ ఏజెంటుకు చూపించి ఓటు వేయడంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరం పెట్టారు. అదే సమయంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫలితంగా దొంతి మాధవ రెడ్డి ఓటును అధికారులు లెక్కలోకి తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్‌ పలు అభ్యంతరాలను చెప్పినా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం. గెలుపొందిన ముగ్గురు నేతల్ని కేసీఆర్ మరియు టీఆర్ఎస్ నేతలు అభినందించారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.