ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీన‌రీ

తెలంగాణ అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్ఎస్ 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాష్ట్ర బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటియించింది. వీటిని ద‌శ‌ల వారిగా ఎలా ఉప‌యోగించ‌బోతుంది స్ప‌ష్టం చేసింది. నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హించే ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు భ‌రోసా క‌ల్పించారు. ఇక కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ అధిష్ఠానం ప్లీన‌రీని ఉప‌యోగించే ప‌నిలో ప‌డింది. ఈ నెల 27 న కోంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వ‌హించేందుకు నాయ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించ‌నున్న‌ట్టు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ సభకు తెరాస ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం… ఇప్పటికే టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు… ప్లీనరీలో ప్రభుత్వ పథకాలకు అభినందనలు తెలిపే తీర్మానాలు ఉంటాయి… బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రోగ్రెస్ ప్రకటిస్తామ‌న్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.