టీఆర్ఎస్ వ్యూహం… ఇదే!

గెల‌వ‌డానికి రెండు మార్గాలు… మ‌నం గెల‌వ‌డం ఒక‌టి, రెండో వాడిని పోటీకి ముందే బ‌ల‌హీన‌ప‌డేలా చేయ‌టం ఒక‌టి. టీఆర్ఎస్‌ రెండో మార్గం ఎంచుకుంది. పాల‌న‌లో బేల‌త‌నం చూపి… ప్ర‌తి హామీని మాఫీ చేసిన కేసీఆర్ మాట త‌ప్ప‌డానికి ప‌రాకాష్ట‌… ద‌ళిత సీఎం. వంద‌ల సార్లు ద‌ళితుణ్ణి ముఖ్య‌మంత్రిని చేయ‌క‌పోతే త‌ల న‌రుక్కుంటాను అని ప‌చ్చిఅబ‌ద్ధం చెప్ప‌డంతోనే అత‌ను విశ్వ‌స‌నీయ‌త కోల్పోయారు. ఇక నిరుద్యోగుల‌ను నిలువునా ముంచారు. ఇంటికి నీరు ఇవ్వ‌క‌పోతే ఓట్ల‌డ‌గ‌ను అని మాట త‌ప్పారు. దీంతో జ‌నం అత‌ని మీద విశ్వాసం కోల్పోయారు. అందుకే అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న కాంగ్రెస్ ఈ స్థాయిలో పుంజుకుంది. మ‌రి దాన్ని టీఆర్ఎస్ ఎలా అడ్డుకుంటోందో తెలుసా?

ఏ పార్టీ అయినా పోల్ మేనేజ్ మెంట్ క‌చ్చితంగా చేయాలి. దానిని బాగా చేసిన‌వారు స‌క్సెస్ అవుతారు. ఇందులో అతిముఖ్య‌మైన విష‌యం ప్ర‌తి పార్టీ ప్ర‌తినిధి చివ‌రి రెండు రోజులు ప్ర‌తి వ్య‌క్తిని క‌లుస్తారు. అందులో పార్టీలు ఉంటాయి, ప్ర‌లోభాలు ఉంటాయి, హామీలు ఉంటాయి, మోటివేష‌న్లు ఉంటాయి. అయితే, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని తాను బ‌హిరంగంగా ఇవన్నీ నిర్వ‌హిస్తోంది. వారి మీద ఫిర్యాదులు కూడా ఎవ‌రు చేసినా అవి మ‌రుగున ప‌డుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్ర‌తిప‌క్షాల‌ను ఏమీ చేయ‌కుండా అడ్డ‌కుంటుంది. వారు ఓటర్ల‌ను చేర‌కుండా చేస్తోంది. ఏం చేసినా ఫిర్యాదులు చేస్తోంది. సామ‌ధాన‌బేద‌దండోపాయాల‌ను వినియోగిస్తోంది. ఓట్ల ఖ‌రీదు కూడా పెంచింది. *పింక్‌* నోట్ల‌ను విప‌రీతంగా వెద‌జ‌ల్లుతోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అలాగే ప్ర‌త్య‌ర్థుల ప్ర‌తి క‌ద‌లిక‌ను *ట్యాపింగ్‌* చేసి వారిని అష్ట‌దిగ్బంధ‌నం చేస్తోంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు విల‌విల్లాడుతున్నాయి. మ‌రీ ఇంత దౌర్జ‌న్య‌మా అని వారు వాపోతున్నారు. మ‌రి దీనిని ఓట‌రు గ‌మ‌నిస్తాడా? రేపు ఏం నిర్ణ‌యిస్తాడు? అన్న‌ది 11 వ‌ర‌కు వేచి చూడాలి.

1 Comment

  1. ఓడిపోతామనే నిస్పృహతో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం, దౌర్జనానికి ఓడిగడుతున్నట్లుంది.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.