కారు పార్టీకి షాక్.. రాజీనామా యోచనలో ముగ్గురు ఎంపీలు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కాలు దువ్వారు. ఎన్నికల సంఘం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో టిఆర్ఎస్ పార్టీ ఒక వైపు ఉండగా, నాలుగు ప్రధాన పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి పోటీ ఈ రెండు పక్షాల మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా.. సీట్ల సర్దుబాటు మాత్రం పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడిప్పుడే కూటమిలోని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. అటు మహాకూటమి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.

ఇప్పటికే కొందరు ఆశావహులు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన నేపథ్యంలో.. ఎన్నికల నాటికి వారి బాటలో పయనించేందుకు పలువురు సన్నాహాలు చేస్తున్నారు. మహా కూటమికి చెందిన పలువురు ముఖ్య నేతలను తెరాస లో చేర్చుకున్న కెసిఆర్.. ఇంకొందరుపై దృష్టి సారించారు. ఇదే సమయంలో టిఆర్ఎస్ చెందిన నేతల పైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో రాజకీయం రక్తి కడుతోంది. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్‌ సభలో త్వరలో తమ పార్టీలోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వస్తున్నారని చెప్పారు. ఇది నిజమో కాదో ఇంకా తెలియదు కానీ, ఇదే సమయంలో టిఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మా పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూర్చింది. ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.