వ్య‌తిరేకత‌ను బాస్ ఒప్పుకోవ‌డం లేదు-టీఆర్ఎస్ ఎంపీ

అనుకున్న‌దే జ‌రిగింది. ల‌గ‌డ‌పాటి ఇంపాక్ట్ మొద‌లైంది. టీఆర్ఎస్లో మ‌రోసారి భ‌యం క‌నిపించింది. ఈ మ‌ధ్యాహ్నం తెలంగాణ స‌ర్వే గురించి ల‌గ‌డ‌పాటి మాట్లాడిన విష‌యం తెలుసు క‌దా. అపుడే టీఆర్ఎస్ నుంచి దానికి రియాక్ష‌న్ వ‌చ్చింది. కానీ ఆ రియాక్ష‌న్‌ను విశ్లేషిస్తే ల‌గ‌డ‌పాటి చెప్పింది నిజ‌మ‌నిపిస్తుంది.

ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే… తెలంగాణ‌లో 8-10 మంది ఇండిపెండెట్లు గెల‌వ‌బోతున్నారు అన్నారు. అందులో నారాయ‌ణ‌పేట నుంచి పోటీ చేస్తున్న శివ‌కుమార్‌రెడ్డి కూడా గెల‌వొచ్చు అన్నారు. దీనిపై ఇత‌ర పార్టీలు పెద్ద‌గా స్పందించ‌లేదు గాని టీఆర్ఎస్ మాత్రం రియాక్ట్ అయ్యింది. నారాయణ్ పేట్ ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి ఒకప్పుడు మా వాడేనని, గతంలో ఓడిపోయి… త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను శివ ఆశించారట‌. కుద‌ర‌క‌పోవ‌డంతో సొంతంగా పోటీ చేశార‌ట‌. కాంగ్రెస్ పార్టీ టికెట్ శివకుమార్ రెడ్డికి లభించలేదన్న సానుభూతి ఉంది కాబ‌ట్టి మంచి ఆద‌ర‌ణ జ‌నంలో ఉంద‌ని జితేంద‌ర్ ఆశ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.
మా బాస్ కేసీఆర్ ఒప్పుకోవ‌డం లేదు. కానీ మా అభ్య‌ర్థుల‌పై వ్య‌తిరేక‌త ఉన్న‌మాట నిజ‌మేన‌ని చెప్పారు జితేంద‌ర్‌. వ్య‌తిరేక‌త వ‌చ్చిన అభ్యర్థులను మార్చాల్సి ఉన్నా బాస్ ఒప్పుకోలేద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఎక్క‌డ ఈ విష‌యం తెలిస్తే కేసీఆర్ నుంచి వాయింపులు వ‌స్తాయ‌నుకున్నారో ఏమో పార్టీపై మాత్రం అస్స‌లు వ్య‌తిరేక‌త లేద‌న్నారు. నారాయణ్ పేట్ లో తమ అభ్యర్థి రాజేందర్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శివకుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉంటారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ భుజాలు తుడుముకుని శివ‌కుమార్‌కు రెండో స్థానం ఇవ్వ‌డంతోనే అక్క‌డ అక్క‌డ ఎవ‌రు గెలుస్తారో డిసైడ్ అయిపోయిన‌ట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.