సొంత పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గత ఎన్నికల్లో మెటారిటీ స్థానాలకు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మరోసారి తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అయితే ఈసారి అది అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణలో కాంగ్రెస్ బలపడడం, ప్రభుత్వాన్ని విభేదించి కోదండరాం పార్టీ పెట్టడం వంటి వాటితో టీఆర్ఎస్ అనుకున్నది జరిగేలా లేదు. దీంతో పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతున్నారనే వార్త ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది.

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికార పీఠమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీని కోసం చేయవలసిన అన్ని పనులకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. అయితే, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని భావించిన కారు పార్టీ ఇతర పార్టీ నేతలను ఆకర్షించింది. దీంతో అధికార పార్టీ హౌస్‌ఫుల్ అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఇది మైనస్‌గా తయారైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి గులాబీ కండువా కప్పుకున్న వారికి కచ్చితంగా సీటు ఇవ్వవలసిందేనని, అలాంటి పరిస్థితుల్లో తమ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టాలని అధికార పార్టీ భావిస్తోందట.

దీని కోసం ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు కేసీఆర్ రహస్య సర్వే చేయించారని ప్రచారం జరుగుతోంది. వారిలో ఒక 15-20 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఫలితాల్లో తేలిందట. ఈ కారణం చూపి వారికి టికెట్ ఇవ్వకుండా ఆపొచ్చని ప్లాన్ చేశారట. అయితే, అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలిసిన పలువురు ఎమ్మెల్యేలు.. టికెట్ ఇవ్వనప్పుడు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అనుకుంటున్నారట. మంచి ముహుర్తం చూసుకుని వేరే పార్టీలోకి జంప్ చేయాలని చూస్తున్నారట. తమకు షాక్ ఇవ్వాలనుకున్న అధిష్టానానికి.. వారే షాక్ ఇవ్వబోతున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.