కోదండం మాస్టారు.. వాళ్లంతా మ‌నోళ్లేనా!

తెలంగాణ జ‌న‌స‌మితికి నాయ‌కులు కావాలోచ్‌. ఎవ‌రొచ్చినా ద్వారాలు తెరిచే వుంటాయి. సీట్లు ఇక మీకే. ఓట్లు అంటారా అది మాత్రం మీరే చూసుకోవాలి. ఇదేందీ.. ఏకంగా అధికార‌మే సొంతం చేసుకుంటామ‌ని జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం మాస్టారు చెబుతుంటే.. ఇట్టా అంటున్నారని భావించేరు. ఎందుకంటే.. ఇవ‌న్నీ అధికార టీఆర్ ఎస్ అంటున్న మాట‌ల‌ట‌. మాస్టారు పార్టీ పెట్టారు.. ఉద్య‌మంలో త‌న వెంట న‌డ‌చిన‌వారు.. ఏ పార్టీలో వున్నా.. మాస్టారూ.. అనుకుంటూ త‌న వ‌ద్ద‌కే వ‌స్తార‌ని ఆయ‌న అనుకుని ఉంటారు. క‌నీసం.. త‌న శిష్యులుగా చెబుతూ తిరిగే వారైనా పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని భావించి ఉంటారు. కానీ.. అవేమీ వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా ఈ మ‌ధ్య కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన కొత్త ప‌థ‌కం.. రైతుబంధు బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ట‌.. అక్క‌డ‌క్క‌డ కాస్త విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఓవ‌రాల్‌గా రైతువ‌ర్గంలో రైతుబంధు చాలా బాగా ఉందంటూ.. నిఘావ‌ర్గాలు.. స‌ర్కారుపై మంచి నివేదికే ఇచ్చాయ‌ట‌. దీంతో మాస్టారు అనుకున్న‌దానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్నాయ‌ట‌. దీంతో మాస్టారు.. మాంచి ప్లాన్ వేశార‌ట‌.

2019లో ఎమ్మెల్యే, ఎంపీ సీటు కోసం ఆశ‌లు పెట్టుకుని ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, ఎంఐఎం ఇలా.. కాస్త జ‌నాల నోళ్ల‌మీదున్న పార్టీల నేత‌ల జాబితా సిద్ధం చేస్తున్నార‌ట‌. ప‌నిలో ప‌నిగా.. ఎన్నాళ్లుగానో ఆయా పార్టీల్లో ఉంటూ.. చీత్కారాలు చ‌విచూస్తున్న మ‌రో చిట్టా కూడా రెడీ చేయ‌మ‌న్నార‌ట‌. రేప‌టిరోజున వీళ్లంద‌రికీ ఆ పార్టీలు సీట్లు ఇవ్వ‌లేవు. అటువంటి వేళ ఈ అసంతృప్తులంతా ఎట్టాగూ పార్టీల‌ను వ్య‌తిరేకిస్తారు. బ‌య‌ట‌కు వ‌చ్చి రెబ‌ల్‌గా పోటీచేస్తారు. కొన్నిచోట్ల గెలిచే నేత‌ల ఓట్ల‌కు గండికొడ‌తారు. సో.. ఇటువంటి వారి జాబితాను ప‌ట్టుకుని.. చివ‌రాక‌ర్లో.. మీకు అక్క‌డ సీటు రాక‌పోతే.. మా వ‌ద్ద‌కు రండి. మీ ఇష్టం. ఎక్క‌డ సీటు కావాలంటే అక్క‌డే.. మా జెండా వాడుకుని.. కేసీఆర్‌ను ఓడించండి.. కుద‌ర‌క‌పోతే.. క‌నీసం ఆ పార్టీకు ప‌డే ఓట్ల‌ను చీల్చండి అంటూ చెబుతార‌ట‌. అందుకే.. ఈ ముంద‌స్తు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఈ లెక్క‌న‌.. మ‌నం ఓడినా ప‌ర్లేదు కానీ.. కేసీఆర్ మాత్రం గెల‌వ‌కూడ‌ద‌నే ధీమాతో మాస్టారు.. మాస్ట‌ర్ ప్లానే వేశారు. ఈ లెక్క‌న‌.. అసంతృప్తులారా.. చింతించ‌కండీ.. ఏం ప‌ర్లేదు.. మ‌న మాస్టారున్నారు.. మీరంతా నావాళ్లేనంటూ.. పిలుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.