మాదే విక్ట‌రీ -కేసీఆర్‌..గ‌డ్డం తీసేస్తా- ఉత్త‌మ్‌

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌ల పోలింగ్ సాఫీగా ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు మొద‌లుకొని సామాన్యుల‌తంతా ఓటు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఇద్ద‌రు ముఖ్యులు ఓటు వేసిన అనంత‌రం చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆ ఇద్ద‌రే తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి. ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ‌దే అధికార‌మ‌ని ప్ర‌క‌టించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 
పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు కేసీఆర్ సతీసమేతంగా చింతమడక గ్రామానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటింగ్ జరుగుతోందని..టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలున్నాయని వెల్లడించారు.  ‘టీఆర్ఎస్‌కు పూర్తి చాలా అనుకూల పవనాలున్నాయి..పవనాలు రోజు మారవు..మంచి ఫలితాలుంటాయి…రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా ఉండబోతోంది..హైదరాబాద్‌‌లో ఇదే పరిస్థితి నెలకొంది…వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆస్తకి కనబరుస్తున్నారు…అంతా సానుకూలంగా ఓటింగ్ జరుగుతోంది…సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో విషయం బయటపడుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మ‌రోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే రీతిలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఓటు వేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఓటింగ్ సరళి, ఓటర్ల ఉత్సహం చూస్తే అధికారంలోకి వస్తున్నామని అర్ధం అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం… ఈ నెల 12వ తేదీన తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాఫ్రంట్ ప్రభుత్వమే…ఈ నెల 12 లేదా 13వ తేదీన నేను గడ్డం తీయబోతున్నాను“ అని తెలిపారు. కాగా, కల్వకుర్తిలో  కాంగ్రెస్ అభ్య‌ర్థి వంశీచంద్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు.  బీజేపీ- టీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతో త‌మ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు పని చేయటం లేదని ఫిర్యాదులు వచ్చాయి… ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.