జ‌న‌సేనానితో.. టీడీపీ మంత‌నాలు!

ఇది నిజ‌మా. అవాస్త‌వ‌మా . అని ఆలోచించ‌వ‌ద్దు. ఎందుకంటే.. పాలిటిక్స్‌లో ఏదైనా సాధ్య‌మే. జేసీ దివాక‌ర్‌రెడ్డి, రాయ‌పాటి వంటి వారు సైకిల్ ఎక్కారు. బొత్స వంటి నాయ‌కుడు వైసీపీలోకి.. క‌న్నా బీజేపీ వెంట న‌డ‌వటానికి ముందుకు… ఆ పార్టీలు.. అధినేత‌ల‌ను దుమ్మెత్తి పోసిన‌వారే కాబ‌ట్టి.. ఇప్పుడు ఇది కూడా జ‌ర‌గొచ్చు.. జ‌రుగుతుంద‌ని మాత్ర‌మే భావించాల‌ని లేదు. కానీ..ప్ర‌స్తుతం మాత్రం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అస‌లు విష‌యానికి వ‌స్తే.. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప‌రోక్ష మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. టీడీపీతో క‌ల‌సి ప్ర‌చారంలో ప‌వ‌న్ పాల్గొన్నారు.

 

ఫ‌లితంగా కాపు ఓట్లు బాగానే సైకిల్ జాబితాలో ప‌డ్డాయంటూ ఆనాడు నేత‌లు స్వ‌యంగా వెల్ల‌డించారు. చంద్ర‌బాబు కూడా.. టీడీపీ గెలుపు ఎంత అవ‌స‌ర‌మ‌నేది ప‌వ‌న్ మ‌ద్ద‌తుతో వెల్ల‌డైందంటూ అభినంద‌న‌లు తెలిపారు కూడా. కానీ.. నాలుగేళ్ల త‌రువాత ఆ ఇద్ద‌రూ తెగ‌తెంపులు చేసుకున్నారు. చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదంటూ ప‌వ‌న్ బ‌హిరంగ వేదిక‌ల్లో విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. పైగా స్వ‌యంగా చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ అవినీతికి వెన్నుద‌న్నుగా ఉంటున్నారంటూ తేల్చారు. ఇప్పుడు ఏకంగా.. క‌డ‌ప ఉక్కు దీక్ష‌పై సీఎం ర‌మేష్‌ను ఘాటుగానే  విమ‌ర్శించారు. మ‌రి ఇన్ని జ‌రుగుతున్నా.. తెలుగుదేశం 2019లో గెల‌వాలంటే జ‌న‌సేన మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంద‌ని మాత్రం భావిస్తుంది. ఇది ప్ర‌త్య‌క్షంగానా.. ప‌రోక్షంగానా అనేది ప‌క్క‌న‌బెడితే.. సీమ‌లో బ‌లిజ‌లు, కోస్తాలో కాపులు బ‌ల‌మైన ఓటుబ్యాంకు  జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే ఓట్ల చీలిక ప్ర‌భావం టీడీపీ, వైసీపీ మీద ప‌డుతుంది. ఈ లెక్క‌న చూస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపున‌కు కార‌ణ‌మైన ఓట్లు.. ఇప్పుడు జ‌న‌సేన‌కు వెళ‌తాయి. అదే జ‌రిగితే.. వైసీపీ నెగ్గుతుంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే ఆల్రెడీ టీడీపీ ఓట‌మి అంచున ఉంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. వైసీపీ ప్ర‌త్యామ్నాయ‌మ‌నే భావ‌న పెరుగుతుంది. జ‌న‌సేన ఇప్పుడే రావ‌టంతో జ‌నం ఈ ఒక్క‌సారి జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇద్దామ‌నే యోచ‌న‌లో ఉన్నారు. ఇవ‌న్నీ ఆలోచించిన చంద్ర‌బాబునాయుడు.. 2019లో గెలుపుకోసం అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌తో క‌ల‌సి న‌డ‌వాల‌నే నిర్ణ‌యానికి వచ్చిన‌ట్టు స‌మాచారం. దీనిలో భాగంగానే ఇప్ప‌టికే ఇరువైపుల కీల‌క‌మైన నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి.. టీడీపీలో అధిక‌శాతం ఇదే కోరుకుంటున్నారు. ప‌వ‌న్ కూడా.. ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్ల‌టంకంటే.. ఏదో ఒక పార్టీతో జ‌త‌క‌ట్టాల‌నుకున్నారు. అందుకే వామ‌ప‌క్షాల వైపు మొగ్గుచూపారు. అయితే.. వారికున్న నామ‌మాత్ర‌పు ఓటుబ్యాంకుతో సీట్ల‌ను గెల‌వ‌టం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం జ‌న‌సేనాని వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. సో.. ఇద్ద‌రూ.. ఒక‌రికొక‌రు చాలా అవ‌స‌రం. విమ‌ర్శ‌లు.. ఇగోలు ప‌క్క‌న‌బెడితే.. ఇరు పార్టీలు ల‌బ్దిపొంద‌వ‌చ్చ‌నేది.. ఇరువైపుల ఉన్న సానుకూల నేత‌ల అంత‌రంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.