దాతృత్వంతో గుండెల్ని ట‌చ్ చేసిన ట‌చ్-ఎ-లైఫ్

ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డంలో నిరుపేద విద్యార్థుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించే ట‌చ్‌-ఎ-లైఫ్ ఫౌండేష‌న్ మ‌రోసారి త‌న దాతృత్వ గుణాన్ని చాటుకుంది. ఇళ్లు లేని అభాగ్య విద్యార్థుల‌కు చ‌దువులో స‌హాయ‌ప‌డేందుకుగాను తాజాగా 25 వేల డాల‌ర్ల నిధులు స‌మీక‌రించింది. అవ‌స‌రంలో ఉన్న విద్యార్థుల‌ను ఆదుకునేందుకుగాను ఏటా నిధులు సేక‌రించాల‌ని ట‌చ్‌-ఎ-లైఫ్ ఫౌండేష‌న్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే వ‌రుస‌గా రెండో ఏడాది ఈ ఫౌండేష‌న్ క్యూప‌ర్టినోలోని కిన్లాన్ క‌మ్యూనిటీసెంట‌ర్‌లో ట‌చ్‌-ఎ-లైఫ్ బాంకెట్‌ పేరుతో ఈ నెల 14న ప్ర‌త్యేక గాలా ఈవెంట్ ను నిర్వ‌హించింది. విద్యార్థుల కోసం విరాళాలు సేక‌రించింది. పాఠ‌శాల విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే బ్యాక్ ప్యాక్ లు, దుస్తులు, సానిటేష‌న్ కిట్లు, షూలు, ఇత‌ర సామ‌గ్రిని స‌మీక‌రించింది. బే ఏరియాలోని ప‌లు జిల్లాల్లో విద్యార్థుల‌కు మెక్ కెన్నీ – వెంటో – ఫాస్ట‌ర్ కేర్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని అంద‌జేసింది.తాజా కార్య‌క్ర‌మానికి సోలింక్స్ టెక్నాల‌జీస్‌, ఎమాజియా కార్పొరేష‌న్ కార్ప‌రేట్ స్పాన్స‌ర్లుగా వ్య‌వ‌హ‌రించాయి. శార‌టోగా కౌన్సిల్ స‌భ్యులు – హైటెక్ లీడ‌ర్ రిషి కుమార్ కో హోస్ట్ గా ఉన్నారు. రాజ్ జ‌స్వా, బి.వి.జ‌గ‌దీశ్, క‌మ‌ల్ నాయ‌ర్‌, మోహ‌న్ టిక్కా, మార్క్ లీ, రుస్ పుర్యీర్‌, ర‌మేశ్ తంగెల్ల‌ప‌ల్లి, కుమార్ శ్రీ‌పాదం, ల‌లితా భ‌ట్టిప్రోలు, త‌దిత‌ర ప్ర‌ముఖులు తాజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. త‌మ‌వంతు సాయం అందించారు. మిను శుక్లా, సాయి ఆర్ట్స్ క్రియేష‌న్స్ ప్ర‌త్యేక‌ ఫొటో స్టూడియోలో పెయింటింగ్ లు, ఫొటోల‌ను వేలం వేయ‌డం ద్వారా విరాళాలు సేక‌రించి అంద‌జేశాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాత‌లు, అవ‌స‌రంలో ఉన్న విద్యార్థులు – పాఠ‌శాల‌ల‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా తాజా కార్య‌క్ర‌మంలో ట‌చ్‌-ఎ-లైఫ్ ఫౌండేష‌న్ త‌మ పేరిట ఓ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ఇది ఐవోఎస్ లోనూ – ఆండ్రాయిడ్ వ‌ర్ష‌న్ లోనూ ప‌నిచేస్తుంది. నిధుల స‌మీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మ‌ద్ద‌తుపై ట‌చ్‌-ఎ-లైఫ్ ఫౌండ‌ర్ -సీఈవో తేజ్ గుండ‌వెల్లి, కో ఫౌండ‌ర్ – కోశాధికారి త్రిష గుండ‌వెల్లి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది కోసం మ‌రింత మెరుగైన ల‌క్ష్యాల‌ను తాము నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది ట‌చ్‌-ఎ-లైఫ్ హీరో అవార్డుల‌ను చైర్ ఆఫ్ ఐసీసీ అను జ‌గ‌దీశ్‌, కార్డియాల‌జిస్ట్‌-ఫిలాంత్రోపిస్ట్ డాక్ట‌ర్ రోమేశ్ జాప్రా, శంక‌ర ఐ ఫౌండేష‌న్ ఫౌండ‌ర్-సీఈవో ముర‌ళీ కృష్ణ‌మూర్తిల‌కు అంద‌జేశారు. 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.