డైరెక్టర్ల మీటింగ్ క్రిష్ కోసమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇతర టెక్నీషియన్ల మధ్య స్నేహ సంబంధాలతో టాలీవుడ్ కళకళలాడుతోంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే కొందరు నటులు, కొన్ని ఫ్యామీలీలకు చెందిన స్టార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. దీంతో తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఒకరి సినిమా ఫంక్షన్లకు మరో స్టార్ వెళ్లడం.. ఒక సినిమా బాగుంటే దానిని అందరూ ప్రశంసించడం ఇప్పుడు ఇండస్ట్రీలో తరచుగా జరుగుతోంది. ఇది ఒక్క హీరోలకు మాత్రమే పరిమితం కాలేదు.. వారిని తెరవెనుక ఉండి నడిపించే డైరెక్టర్లు కూడా ఈ జాబితో ఉన్నారు.

రంగం ఏదైనా పోటీ కేవలం వాళ్ల పనిలో మాత్రమే ఉంటుంది. ఏ రంగంలో అయినా అగ్ర‌స్థానంలో ఉన్న వారి మ‌ధ్య పోటీ స‌హ‌జం. అలానే ఇండ‌స్ట్రీలోనూ హిట్ల మీద హిట్లు ఇస్తున్న ద‌ర్శ‌కుల్లో కూడా పోటీ ఉండ‌టం కామ‌న్. కాక‌పోతే, అది సినిమా వర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని, ఆ త‌ర్వాత అంద‌రం ఒక్క‌టేన‌ని చెప్పేలా దిగ్గ‌జ ద‌ర్శ‌కులంతా రుజువు చేసుకున్నారు. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లుగా ఉన్న రాజ‌మౌలి, క్రిష్, సుకుమార్, కొర‌టాల శివ‌, హ‌రీష్ శంక‌ర్, అనిల్ రావిపూడి, వంగా సందీప్ రెడ్డి, నాగ అశ్విన్ మ‌రియు వంశీ పైడిప‌ల్లి ఒక చోట కలుసుకున్నారు.

అయితే వీరి కలయిక తర్వాత.. రాజ‌మౌళి ‘‘సర‌దాగా సంద‌డి చేయ‌డానికి, మా మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండ‌వ‌ని, స్నేహ‌బంధం మాత్ర‌మే ఉంటుంద‌ని తెలిపేందుకు క‌లుసుకున్నా’’మంటూ ట్వీట్ చేశాడు. కానీ, వీరి కలయికకు దీనితో పాటు మరో కారణం కూడా ఉందట. ఇటీవల దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన క్రిష్ దాంప‌త్య జీవితం స‌జావుగా సాగడం లేద‌ని, ఆ దంపతుల మ‌ధ్య చోటుచేసుకున్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయ‌ని, క్రిష్ దంపతులు విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో విడాకుల‌కు సంబంధించి వార్త‌లు సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో అస‌లేం జ‌రిగిందో తెలుసుకుని, క్రిష్ దంప‌తుల‌ను ఒక్క‌టి చేసేందుకే ద‌ర్శ‌కులంతా ఒక్క‌ట‌య్యార‌ని కొత్త రూమ‌ర్ బ‌య‌టికి వ‌చ్చింది. ఎలాగైనా, క్రిష్ జీవితంలో మ‌చ్చ ఏర్ప‌డ‌కుండా, అస‌లు ఎందుకు విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడో తెలుసుకుని, ఆ దంపతుల మ‌ధ్య ఏర్ప‌డ్డ గ్యాప్‌ను పూడ్చే ప్ర‌య‌త్నం చేసేందుకు రంగంలోకి దిగార‌ని, అందుకే తెల్ల‌వార్లు సుధీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు, అందరూ కలిసి క్రిష్ మనసును కూడా మార్చరనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ టాలీవుడ్ డైరెక్టర్లు.. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మంచి డైరెక్టర్లుగా నిలిచిపోతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.