నిజం దాచిన కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌… సిగ్గు విడిచి జ‌నాల‌ను ఓట్లు అడుగుతున్నార‌ని కోదండ‌రాం తీవ్రవ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఆయ‌న ఏం చేశార‌ని, మ‌ళ్లీ ఓట్లు వేసి గెలిపించాల‌ని కోదండ‌రాం ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాల‌న నియంతృత్వానికి అడ్ర‌స్‌లా నిలిచింద‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.
మ‌హాకూటమిది ప్రజా కాంక్ష పాల‌న‌. కేసీఆర్‌ది ప్ర‌జాకంట‌క పాల‌న‌. కేసీఆర్‌కు తెలిసిన రాజ‌కీయం ప్రాజెక్టుల్లో క‌మీష‌న్లు సంపాదించ‌డం, ఇత‌ర‌పార్టీ అభ్య‌ర్థుల‌ను కొన‌డం అన్నారు. నాలుగున్న‌రేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ఇంకా టైం స‌రిపోలేదు అంటున్న ఆయ‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని, రోజురోజుకి కూట‌మిపై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని కోదండరాం అన్నారు. ఈరోజు కోదండ‌రాం బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో మాట్లాడారు.
జేఏసీని ఏర్పాటుచేసి న‌డిపిన త‌న‌కు పార్టీని స్థాపించి శాఖ‌లు విస్త‌రించ‌డం పెద్ద క‌ష్టం కాలేద‌ని, ఉద్య‌మ రోజుల్లో ఏర్ప‌డిన ప‌రిచ‌యాలే పార్టీని ఇంత పెద్ద స్థాయికి తెచ్చాయ‌న్నారు. మ‌హాకూట‌మితో పొత్తుకు ప్ర‌జా అజెండాయే కార‌ణం అన్నారు. టీజేఎస్ అంతిమ ల‌క్ష్యం ప్ర‌జా సంక్షేమం. దానికోస‌మే మ‌హాకూట‌మిలో చేరాం. ప్ర‌జ‌ల‌ను బెదిరించ‌డం కేసీఆర్ నైజం. ఇంకోసారి అధికారం చేతిలో పెడితే తెలంగాణ పునాదులు క‌దిలిపోతాయ‌ని కోదండ‌రాం ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.
త‌మ పార్టీకి గ్రామ స్థాయిలో బాగా ప‌ట్టుంద‌ని, నాలుగైదు నెల‌ల్లోనే పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కేసీఆర్ గొప్ప‌లు చెబుతున్నారు. అన్నీ అబ‌ద్ధాలే. 97 శాతం భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న చేశాం అంటున్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను క‌లిస్తే తెలిసేది. ఇంకా 40 శాతం మంది స‌మ‌స్య‌లు తీర‌లేద‌న్నారు. ఆ ప‌నిమానేసి ఎన్నిక‌ల ప‌ని పెట్టుకున్న కేసీఆర్ త‌న‌కు న‌చ్చింది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన‌ది ఏనాడూ చేయ‌ర‌ని కోదండ‌రాం వ్యాఖ్యానించారు.

1 Comment

  1. కేసీఆర్, మోడీ ఇద్దరూ మాటలతో మోసం చేసే మహా మాయగాళ్ళు. చేతల్లో చూపించేది సూన్యమే.వీరిని నమ్మి ఓటేస్తే మోసపోయేది మనమే.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.