గుప్త నిధుల కోసమే పోటును తవ్వుతున్నారా…

తిరుమల తిరుపతి దేవస్థానం పై రగడ రేగుతున్న సంగతి తెలిసిందే. తిరుమలలో పోటును మూసేసిన సంగతి తెలిసిందే. 2001, 2007లోను ఇలానే పోటును మూసేశారు. అభివృద్ధి పనులు చేశారు. సంప్రోక్షణ తర్వాత దాన్ని తిరిగి తెరిశారు. స్వామి వారికి నైవైద్యం తయారు చేసేది పోటులోనే. అలాంటి పోటును అపవిత్రం చేశారని రమణదీక్షితులతో పాటు.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వయసు మీద పడిన వారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. 2013లోనే ఈ జీవోపై టీటీడీ ఆమోదం తెలిపింది. 65 ఏళ్ల పైబడిన అర్చకుల సేవలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. అది రమణ దీక్షితులకు ఇబ్బందిగా మారింది. అనేక ఆరోపణలు చేసిన ఆయన వజ్రాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. విదేశాల్లో దాన్ని అమ్మారని చెప్పారు. అసలు వజ్రమే లేదని.. అది కెంపు అని చెబుతోంది టీడీపీ.   
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి మరో సంచలన ఆరోపణ చేశారు. తిరుమల శ్రీవెంకటేశ్వరుడి కి సంబందించిన సొత్తును చంద్రబాబు కాజేశారని  విమర్శించారు. వాటిని హైదరాబాద్ లోని తన ఇంటికి తరలించారని, వెంటనే సిబిఐ ,లేదా తెలంగాణ పోలీసులు దాడులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను రుజువు చేస్తానని, లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసరడం ఆశ్చర్యం. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారని చెప్పారు.  12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని వెల్లడించడం అనేక అనుమాలకు తెరలేపింది. వైకాపా నేతలు కాబట్టి సహజంగానే టీడీపీ పై ఆరోపణలు చేశారా.. లేక నిజం ఉందా అనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.