ఈ నేత‌లు.. బ్యాలెట్ బ‌రిలో నెగ్గ‌లేరా!

పార్టీల మ‌నుగ‌డ‌కు నాయ‌కులు కావాలి. అదీ కాస్తో..కూస్తో.. పెట్టుబ‌డి పెట్టే వ్యాపారులు అవ‌స‌రం. అదీ కాదంటే కుల స‌మీక‌ర‌ణ‌ల‌తో మాట‌ల‌కు అడుగులు వ‌త్తేవారై ఉండాలి. అందుకే.. కొంద‌రు అమాంతంగా మంత్రులు, ఎమ్మెల్సీలు,ఎంపీలుగా మారిపోతారు. అర్రే.. వీళ్ల పేరే ఎప్పుడూవిన‌లేదా అనుకునేలోపుగానే..గ‌ద్దెనెక్కి చ‌క్రం తిప్పుతుంటారు.. ఏపీ, తెలంగాణాలో ఇటువంటి బాప‌తానేత‌లు చాలా మందే ఉన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లో అన్ని పార్టీల్లోనూ కావాల్సిన వారంతా కొలువుదీరుతుంటారు. అందాకా ఎందుకు.. ఏపీలో ఒక నారాయ‌ణ‌.. మ‌రొక సుజ‌నాచౌద‌రి, మ‌రో.. సీఎంర‌మేష్ వీళ్లంతా.. అలాగే వ‌చ్చి ఏకంగా మంత్రుల‌య్యారు. నారాయ‌ణ అంటే.. విద్యాసంస్థ‌ల య‌జ‌మాని. పైగా కాపుల కోటాలో మంత్రిప‌ద‌వి ఇస్తామ‌నే హామీ ఇచ్చారు కాబ‌ట్టి అమాత్యుడ‌య్యాడు. అంతకుముందే ఎమ్మెల్సీ అయ్యారు. సుజ‌నాచౌద‌రి కూడా అంతే.. రెండోసారి ఎంపీగా ఎన్నికైన సీఎంర‌మేష్ నిజంగా ల‌క్కీ నేత అనాలేమో. ఎన్నిఆరోప‌ణ‌లు.. లోకల్ నాయ‌కుల చీద‌రింపులు.. శాప‌నార్దాల‌ను ప‌ట్టించుకోకుండా టీడీపీ అదిష్ఠానం ఆయ‌న‌కు రెండోసారి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని క‌ట్ట‌బెట్టింది. వైసీపీకోట‌రీలో విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌కు చెక్కేశారు. కాంగ్రెస్‌లోనూ కొంద‌రున్నా ప‌వ‌ర్ లేదు కాబ‌ట్టి లెక్క‌లో తీసుకోవాల్సిన ప‌నిలేద‌నే చెప్పాలి. తెలంగాణ‌లో కొండా సురేఖ భ‌ర్త‌.. కేకే, డీశ్రీనివాస్ ఇలా.. నేత‌ల కులాల‌తో ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. మ‌రి.. 2019 లో వీరి ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న కూడా నేత‌ల్లో మొద‌లైంద‌ట‌. వాస్తవానికి చ‌ట్ట‌స‌భ‌ల్లో మేధావులు, విద్యావంతులు ఉండాల‌నే ఉద్దేశంతో రాజ్య‌స‌భ‌, శాస‌న‌మండలిలో ఎమ్మెల్సీ, ఎంపీల ఎన్నిక జ‌రుగుతుంది.

కానీ.. త‌మ‌ను మించిన మేధావులు ఎవ‌ర‌న్న ఉద్దేశంతో ఖ‌ద్ద‌రు నేత‌లు.. రాజ‌కీయ నిరుద్యోగం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ ప‌ద‌వుల‌ను అలంక‌రిస్తున్నారు. ల‌క్ష‌ల నుంచి కోట్ల ధ‌ర ప‌లికే సీటును సొంతం చేసుకునేందుకు అప్ప‌టి వ‌ర‌కూ అడ్డ‌దారిలో కూడ‌బెట్టిన కాసుల‌ను కుమ్మ‌రిస్తున్న నేత‌లూ లేక‌పోలేదు. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో పార్టీలే.. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వీరినీ రెడీమేడ్ నాయ‌కులుగా త‌యారుచేసి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపుతోంది. ఈ లెక్క‌న‌.. ఈ నేత‌లంద‌రూ.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల చేతిలో ఎన్నికై.. గెలిచే అవ‌కాశం లేనివార‌నే అప‌వాదును మూట‌గ‌ట్ట‌కుంటున్నారు. మ‌రి దీన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకైనా బ్యాలెట్ బ‌రిలో నిలిచేందుకు ఎంత‌మంది నేత‌లు ముందుకువ‌స్తారో చూడాలి మ‌రీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.