ఎన్టీఆర్ ను కలవరిస్తున్న శేఖర్ మాస్టర్

        యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ను కలవరిస్తున్నాడు డాన్స్ మాస్టర్ శేఖర్. ఢీ, నీతోనే డాన్స్ తో పాటు..పలు షోలు చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. అవకాశాలు లేకుండా అతను ఇబ్బంది పడే రోజుల్లో ఎన్టీఆర్ చేరదీశాడట. తనకు మంచి అవశాలిచ్చారని శేఖర్ మాస్టర్ గుర్తు చేశారు. చేసిన సాయం, మేలును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. చాలా మంది స్టార్ హీరోలతో పనిచేసినా.. తారక్‌తో ఉన్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందని ప్రస్తావించాడు. ఎన్టీఆర్  సినిమాలో కనీసం రెండు, మూడు పాటలైన శేఖర్ మాస్టార్ చేయిస్తుంటాడు తారక్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన బంతిపూల జానకి, ఆపిల్ బ్యూటీ, పక్కా లోకల్, స్వింగ్ జరా పాటలు మంచి పేరును తీసుకువచ్చాయి. అందుకే ఎన్టీఆర్‌కి తానెంతో రుణపడి ఉన్నానని శేఖర్ మాస్టర్ చెప్పాడు. 
         మరోవైపు ‘టాప్ లేచిపోద్ది’ పాటకి పనిచేయాలని అల్లు అర్జున్ ఫోన్ చేసి చెప్పారని..అది తనకు మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. కొరియాగ్రాఫర్ గా అడుగు పెట్టడం అంత తేలిక కాదని..అదే సమయంలో రాణించడం తేలిక కాదంటున్నారు శేఖర్ మాస్టర్. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. కానీ సాయం తీసుకున్న తర్వాత గుర్తు పెట్టుకునేవారు తక్కువేనని చెప్పాలి. కానీ కొరియాగ్రాఫర్ శేఖర్ గతాన్ని మర్చిపోకుండా వాస్తవాలు మీడియాకు చెప్పడం అభినందనీయమే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.