అదేనా.. ప‌వ‌న్ టార్గెట్‌!

చంద్ర‌బాబునాయుడు బాగానే ప‌నిచేస్తున్నారు. తెలంగాణ‌కు చంద్ర‌శేఖ‌ర్ దిశానిర్దేశం చేయ‌గ‌ల నాయ‌కుడు. ఇదేదో సొంత పార్టీ నేత‌లు పొగిడితే విష‌య‌మేకాదు. కానీ.. ప్ర‌తిప‌క్ష హోదాలో.. అందులోనూ ప్ర‌శ్నించ‌టానికే పార్టీ.. ఏర్పాటు చేశానంటూ.. గ‌ళం విప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నోటి నుంచి రావ‌ట‌మే వివాదాంశం. అధికార పార్టీల‌కు ప్ర‌శంస‌లు.. విన‌సొంపుగా వున్నా.. విప‌క్షాలు మాత్రం.. పొగిడేందుకు పార్టీ ఎందుకంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. దీనికి ప‌వ‌న్ చెప్పే స‌మాధానం ఒక్క‌టే.. మంచ ని మంచిగా చెబుదాం.. బాగాలేన‌పుడు.. బాగాలేదంటూ నిల‌దీద్దాం అంటూ.. కానీ.. నేటి రాజ‌కీయాల‌కు ఇవ‌న్నీ సాధ్యం కాదంటూ మ‌రో విమ‌ర్శ‌. తిక‌మ‌క పెడుతున్న ప‌వ‌న్ రాజ‌కీయంలో.. జ‌న‌సేన అస‌లు ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు? ఎవ‌రిని ఓడించేందుకు ఇంత‌గా త‌ప‌న‌ప‌డుతున్నాడు. అది వైఎస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీయా, కేసీఆరా, చంద్ర‌బాబా.. ప‌వ‌న్ మదిలో అస‌లు ఏవుంది.. తెలుగు నేల‌పై జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర‌మైన చ‌ర్చ‌కు.. రాజ‌కీయ నిపుణులు చేస్తున్న విశ్లేష‌ణ ఇలా ఉంది.
2009 ప్ర‌జారాజ్యం ఏర్పాటు స‌మ‌యంలో యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంగ్రెస్ నేత‌ల గురించి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పంచెలూడ‌పీకి త‌ర‌మిత‌ర‌మి కొడ‌దాం అంటూ.. చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేకెత్తించాయి. వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా దోచుకున్న తీరుపై  ఆనాడే ప‌వ‌న్ విమ‌ర్శించారు. ప్ర‌జారాజ్యం పార్టీను కొన‌సాగిద్దాం. విప‌క్షంలో ఉండి కూడా.. పోరాడ‌దాం అంటూ.. ప‌వ‌న్ చేసిన సూచ‌న‌లు అక్క‌డ ఎవ‌రి చెవికీ ఎక్క‌లేదు. పైగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒత్తిడితోనే ప్ర‌జారాజ్యం పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేశార‌నేది ప‌వ‌న్ మ‌న‌సులో ప‌డిన ముద్ర‌. అటువంటి స‌మ‌యంలోనే.. వైఎస్ మ‌ర‌ణం త‌రువాత‌.. ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తండ్రి పార్దివ‌దేహాన్ని ప‌క్క‌న బెట్టుకుని సీఎం పీఠం కోసం సంత‌కాల సేక‌ర‌ణ కూడా మ‌రో కార‌ణం. ల‌క్ష కోట్ల కుంభ‌కోణంలో సీబీఐ కేసులు ఏడాదిన్న‌ర పాటు జైలు జీవితం గ‌డ‌పిన జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్ర ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌నేది కూడా ప‌వ‌న్ ఆందోళ‌న‌కు మ‌రో కార‌ణం. వీట‌న్నింటి నేపథ్యంలోనే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి స‌హ‌కారం అందించారు. ఇప్పుడు ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం బీజేపీతో క‌య్యానికి సై అంటున్నారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో కొత్త రాష్ట్ర అభివృద్ధి ఎంత క‌ష్ట‌త‌ర‌మేది ప్ర‌త్య‌క్షంగా చూస్తూ.. చంద్ర‌బాబుకు వెన్నంటి ఉంటున్నారు. ప్ర‌భుత్వంతో ప‌నిచేయించాలంటే.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు.. మీడియా స‌మావేశాల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌కూడ‌ద‌నే విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి వున్న‌ట్లు ప‌లుమార్లు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. 2019లోనూ అన్ని చోట్ల పోటీచేయాల‌నేది ఇప్ప‌టి ఆలోచ‌న మాత్ర‌మే.. రేప‌టికి మార‌బోయే స‌మీక‌ర‌ణ‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌నేది ప‌వ‌న్ ఇటీవ‌ల మీడియాతో అన్న‌మాట‌లు. పోన్లే చిరంజీవి జ‌న‌సేన‌లోకి వ‌స్తాడ‌నుకునే వారికీ.. ప‌వ‌న్ ఇచ్చిన స‌మాధానం.. మా అన్న‌య్య ఇప్ప‌టికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారంటూ తేల్చిచెప్పారు. చెప్ప‌క‌నే.. త‌న మ‌ద్ద‌తు..రాష్ట్ర మంచికోరేవారికంటూ స్ప‌ష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.