వెంక‌టేశా… ఏందీ అలా అనేశా!

ఎవ‌రెప్పుడు నోరుజార‌తారో తెలియ‌ని అయోమ‌యం.. అన్ని పార్టీల‌కూ త‌ల‌నొప్పిగా మారింది. ముఖ్యంగా ఎన్నిక‌ల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న వేళ ఇది ఎక్క‌డ‌కు దారితీస్తుంద‌నే భ‌యం కూడా పార్టీల అధినేత‌ల‌కు చికాకు తెప్పిస్తుంది. ఈ జాబితాలో టీడీపీయే ఒక‌డుగు ముందులో ఉండ‌టమే ఇక్క‌డ చెప్పుకోద‌గిన విష‌యం. రాయ‌పాటి, జేసీ దివాక‌ర్‌రెడ్డి వంటి ఎంపీలు.. సీనియ‌ర్లు కూడా త‌లోసారి ఇట్టా నోరుజారి అభాసుపాలై సంఘ‌ట‌న‌లూ ఉన్నాయి. ఇప్పుడిదే దారిలో టీడీపీ ఎంపీ టీజీ వెంక‌టేష్ కూడా చేరారు. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన ఆయ‌న్ను దేశం పార్టీ భాగానే భుజాన వేసుకుంది. ప‌ద‌విచ్చి మ‌రీ గౌర‌వించింది. అందుకే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఏం మాట్లాడ‌లేదు. విప‌క్షాల‌పై ఎటువంటి కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. ఇక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఉనికి కోస‌మ‌ని కాబోలు కేసీఆర్‌ని టార్గెట్ చేసుకుని కొన్ని కామెంట్స్ చేసి సంచ‌ల‌నంగా మారాడు. ఏపీ ప్ర‌త్యేక హోదాపై కేసీఆర్ .. చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌వాలంటూ సూచించాడు. సారీ ఆదేశించాడు. లేక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో సీమాంధ్రులు ఎవ‌రూ గులాబీ పార్టీకు ఓటేయారంటూ మ‌రోసారి ప్రాంతీయ‌వాదాన్ని తెర‌మీద‌కు తెచ్చాడు. దీంతో ఇప్ప‌టికే చంద్రుల మ‌ధ్య ర‌చ్చ రంబోలాగా మారింది. ఓటుకు నోటు కేసు ఎక్క‌డ టీడీపీ అధినేత మెడ‌కు చుట్టుకుంటుంద‌ని ఆచితూచి త‌మ్ముళ్లు అడుగేస్తున్నారు. ఇటువంటి  వాతావ‌రణంలో టీజీ కామెంట్స్ పార్టీను ఇరుకున పెట్టేవే అనే వాద‌న వినిపిస్తుంది. అయినా.. ఈ పెద్దాయన ఇప్ప‌టి వ‌ర‌కూ సైలెంట్ గా ఉండి.. ఎందుకీ అన‌వ‌స‌ర‌మైన చర్చ‌కు అవ‌కాశం ఇచ్చాడంటూ సొంత‌పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. నిజ‌మే.. టీజీ కామెంట్స్‌లో ఒక్క నిజం దాగుంది. ఎందుకంటే.. తెలంగాణ‌లో ముఖ్యంగా హైద‌రాబాద్ ప‌రిధిలో 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో సీమాంధ్రుల ఓట్లు గెలుపోట‌ముల్లో కీల‌కం. అందుకే గ‌తేడాది జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ దానిలో సీమాంధ్రులు కూడా త‌మ‌వైపు ఉండ‌ట‌మే కార‌ణ‌మంటూ ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. పైగా ఏపీకు ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో తాము మ‌ద్దతు ఇస్తున్న‌ట్లు.. ఎంపీ క‌విత‌, కేసీఆర్ కూడా ప‌లు స‌మావేశాల్లో స్ప‌ష్టంచేశారు. సోద‌రులుగా తెలుగు రాష్ట్రాలు ఉందామంటూ.. నేత‌లు కూడా రాజీధోర‌ణిలో ఉంటున్నారు. ఇలాంటిది.. మ‌ధ్య‌లో అవ‌గాహ‌న‌లేమితో టీజీ లాంటి నేత‌ల కామెంట్స్ లేనిపోని త‌గాదాల‌కు అవ‌కాశం ఇస్తాయ‌ని సామాన్యుడి ఆవేద‌న‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.