తెలుగు ఎంపీలు.. ఎమ్మెల్యేలు అవ్వాల‌నుకుంటున్నారా!

ఢిల్లీలో కూర్చుని రాజ‌భోగాలు అనుభ‌వించ‌వ‌చ్చు.. అవ‌స‌ర‌మైతే చ‌క్రం తిప్ప‌వ‌చ్చు. ఎన్నో అనుమ‌తులు.. కాంట్రాక్టులూ ద‌క్కించుకోవ‌చ్చు. కానీ.. ఇదేమిటీ.. ఇంత వైభ‌వం క‌ళ్లెదుట వున్నా తూచ్‌.. వ‌ద్దంటూ మ‌ళ్లీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితమ‌వుతున్నార‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణాల్లో ఎన్నిక‌ల వ్యూహాల‌కు రాజ‌కీయ పార్టీలు ప‌ద‌ను పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నాయి. తెలంగాణ‌లో 100 సీట్లు మావేనంటూ టీఆర్ ఎస్‌, ఏపీలో 160 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ప‌క్కాగా రావాలంటూ టీడీపీ శ్రేణులు ఎత్తులు వేస్తున్నాయి. విప‌క్షాల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసేందుకు వున్న మార్గాల‌ను అన్వేషిస్తున్నాయి. ఇటువంటి సమ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విప‌క్ష పార్టీలు, ఎంపీలు.. మ‌ళ్లీ నెగ్గాల‌ని.. చూస్తుండ‌టం స‌హ‌జం. కానీ.. తెలుగు రాష్ట్ర ఎంపీలు మాత్రం.. 2019లో ఢిల్లీ వ‌దిలి. సొంత రాజ‌ధానిలో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అయితే దీని వెనుక‌. ఉన్న‌చోట పేరు ప్ర‌తిష్ఠ‌ల‌తోపాటు.. ఎంతొకొంత కూడ‌బెట్టుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న కూడా కార‌ణం కావ‌చ్చు. మ‌రో విష‌యం.. వీలైతే.. అమాత్యుడిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌చ్చు. అదే.. కేంద్రంలో ఉంటే.. కేవ‌లం ఎంపీగానే ఉండాలి. మంత్రి ప‌ద‌వి అనేది క‌ల‌గానే మిగులుతుంది. నిజామాబాద్ ఎంపీ క‌విత నుంచి క‌ర్నూలు ఎంపీ బుట్టారేణుక వ‌ర‌కూ.. ఈ ద‌ఫా తాము ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా తాము ఎక్క‌డ పోటీ చేయాల‌నే అంశంపై కూడా స్ప‌ష్ట‌త కు వ‌చ్చారు. ఈ లెక్క‌న ఏపీలో  విశాఖ‌, రాజ‌మండ్రి, న‌ర్సాపురం, విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌డ‌ప త‌దిత‌ర చోట్ల ఎంపీలుగా గెలిచిన వారంతా.. ఎమ్మెల్యేలుగా బ‌రిలోకి దిగాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. తెలంగాణ‌లో సికింద్ర‌బాద్‌, మ‌ల్కాజ‌గిరి గ‌ట్టి పోటీ ఉంది. పైగా రాజ‌కీయాలు మారాయి. దీంతో ఇక్క‌డ పోటీకు త‌ట్టుకోవాలంటే కోట్లు కుమ్మ‌రించాల‌నే భ‌యం కూడా నేత‌ల‌ను వెంటాడుతుంద‌ట‌. వాస్త‌వానికి.. ఎమ్మెల్యేగా కేవ‌లం ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం. అదే ఎంపీగా ఆరేడు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలి. క్రాస్ ఓటింగ్ భ‌యం ఉండ‌నే ఉంటుంది. పైగా..ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఖ‌ర్చులు.. కోట్ల‌కు చేరుతున్నాయి. ఓ ఎంపీ లెక్క ప్ర‌కాం 2019లో ఎమ్మెల్యే స్థానానికే రూ.70కోట్ల వ‌ర‌కూ పెట్టాలేమో అంటున్నారు. అదే ఎంపీగా అయితే.. రూ.100 కోట్లు దాటుతాయంటున్నారు. పైగా.. గెలుస్తామ‌నే గ్యారంటీ చివ‌రి నిమిషం వ‌ర‌కూ క‌ష్ట‌మేనంటున్నారు. ఈ లెక్క‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు కోసం..కోత్త‌వారు.. కోట్లున్న వారు మాత్ర‌మే ముందుకు వ‌స్తారేమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.