చంద్రుల రాజ‌కీయం.. మోదీ వ్యూహ తంత్రం!

హ‌స్తిన‌లో రాజ‌కీయం వేడెక్కింది. ఒక‌ప్పుడు.. కాంగ్రెస్‌కు బుద్దిచెప్పి.. జాతీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేకెత్తించిన తెలుగోడు.. ఎలాంటి మెలిక‌లు పెడ‌తార‌న‌ది అర్ధం చేసుకునేందుకు ఢిల్లీ పెద్ద‌లు బుర్ర‌లు బ‌ద్ద‌లు చేసుకుంటున్నారు. చావ్లా వాలా.. ఎంత ప‌నిచేస్తార‌నే ఉత్కంఠ‌కు మ‌నోళ్లు భ‌లేగా తెర‌లేపారు. ప్ర‌ధాని మోదీపై.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. దాదాపు నాలుగేళ్లుగా ఎంతోమంది విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రెన్నో వివాదాలు చేశారు. కానీ.. ప‌క్క‌నే ఉంటూ.. మిత్రులుగా బ‌లంగా నిల‌బ‌డుతూ.. తెలుగు సీఎంలిద్ద‌రూ.. త‌మ రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నుకునే స‌మ‌యంలో కావ‌చ్చు.. మ‌రే కార‌ణ‌మైనా కావ‌చ్చు.. ఒకేసారి.. మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌ట‌మే కాదు.. ఏకంగా.. సై అంటూ కాలు దువ్వారు. కేసీఆర్‌.. ఆచితూచి అడుగులేసినా.. చంద్ర‌బాబునాయుడు మాత్రం మొండిగా.. క‌టీఫ్ అంటూ తేల్చారు. దోస్తీలేదు.. ఏమిలేదంటూ ఏకంగా స‌ర్కారును కూల్చేందుకు మ‌ద్దతు కూడ‌గ‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌శేఖ‌ర్ తాను ఎక్క‌డ ప‌లుచ‌న అవుతాన‌నే ఉద్దేశంతో కాబోలు.. ప‌శ్చిమ‌బెంగాల్ ప‌య‌న‌మ‌య్యారు. మ‌మ‌తాబెన‌ర్జీతో మంత‌నాలు జ‌రిపి.. రాబోయే ఫ్రంట్ ఏర్పాటుకు  వ్యూహ‌ర‌చ‌న‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. సీఎంలే.. ఇలా చేస్తున్న‌ప‌ప్పుడు.. యావ‌త్ భార‌తావ‌నిపై పెత్త‌నం చేస్తున్న న‌రేంద్ర‌మోదీ ప్ర‌తివ్యూహాల‌కు ప‌ద‌ను పెట్ట‌కుండా ఉంటారా.. తెలుగోళ్ల‌ను దారికి తెచ్చుకునే మంత్రాంగానికి ర‌చ‌న చేయ‌కుండా ఉంటారా! ఇప్పుడు జ‌రుగుతుంది అదే.. రాంమాధవ్ ద్వారా.. తెలుగు సీఎంల‌కు.. ప‌రోక్ష చుర‌క‌లు వేయించారు. మీ లెక్క‌ల‌న్నీ.. మా వ‌ద్ద ఉన్నాయంటూ.. మూడు నెల‌లు ఆగ‌మంటూ అల్టిమేటం ఇచ్చారు. చంద్రులిద్ద‌రూ.. ఎంత నిప్పు అనేది ప‌క్క‌న‌బెడితే.. పాల‌న‌లో త‌ప్పిదాలు.. త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఉంటాయా! అంటే.. చాలానే ఉంటాయి. ఇది మోదీకు మాత్రం తెలియ‌నిదా! అయినా.. దిక్కార‌మున్ చేతురా! అంటూ.. కేవ‌లం ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం కోసం చంద్రుల‌పై ఉరిమినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. దీనికి త‌గిన‌ట్లుగా ఆయ‌న వ‌ద్ద వున్న స‌మాచారం.. గులాబీ, ప‌సుపు పార్టీల్లో వున్న త‌న ర‌హ‌స్య గూడ‌ఛారుల ద్వారా ఇప్ప‌టికే కేంద్రం ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన పద్దులు తెప్పించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అవిశ్వాసంలో ఓడినా.. గెలిచినా.. దానికి త‌గిన‌ట్లుగా అస్త్రశ‌స్త్రాలు ప్ర‌యోగించేందుకు అమిత్‌షా త్ర‌యం.. రెడీ అవుతుందట‌. దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం జ‌రిపి.. దిశానిర్దేశం చేశార‌ట‌. చంద్రులిద్ద‌రూ వేర్వేరుగా చేస్తున్న ప్ర‌యోగాలు.. ప్ర‌య‌త్నాలు ఫ‌లించినా.. ఫ‌లించ‌క‌పోయినా.. ఢిల్లీ నేత‌ల‌కు.. తెలుగువాడి వేడి బాగానే రుచి చూపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.