టాలీవుడ్‌లో బూతు సినిమాల హంగామా

అన్ని భాషలతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో బూతు సినిమాలు తక్కువ వస్తుంటాయి. అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా జీర్ణించుకోలేరు. అందుకే టాలీవుడ్‌లో లిప్‌ లాక్ సీన్స్ కూడా సెన్సార్ చేసేసేవారు. అయితే, ఇదంతా గతం. ఈ మధ్య వస్తున్న సినిమాలకు బౌండరీలు అనేవి లేకుండా పోతున్నాయి. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు మూడు ముద్దులు.. ఆరు రొమాంటిక్ సీన్స్‌లా సాగిపోతున్నాయి. బడా హీరో నుంచి చోటా హీరో దాక కిస్ సీన్ లేకపోతే ఏదో లోటుగా మారిపోతోంది. అందుకే ఆ తరహా సినిమాలు ఈ మధ్య తెలుగు తెరపై తళుక్కుమంటున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, లిప్‌లాక్ సీన్స్‌, రొమాన్స్ ఇలా అడల్డ్ కంటెంట్‌ సినిమాలు తెలుగు భాషలో రూపొందుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సెన్సార్ దగ్గరే ఆగిపోతుండగా, మరికొన్ని ఆ పరిధులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 2017లో వచ్చిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, 2018లో విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ ఈ రెండు సినిమాలు అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కినవే. వీటి ప్రభావం టాలీవుడ్ మీద బాగా పడింది. ఈ సినిమాల ప్రేరణతోనే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ సినిమాల తర్వాత అదే జోనర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, అవి రిలీజ్‌కు నోచుకోలేదు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘24 కిస్సెస్’ పలు వివాదాలకు కారణమైంది. హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ జంటగా నటించిన ఈ సినిమాను ‘మిణుగురులు’ ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తెరకెక్కించాడు. దీని తర్వాత అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ కూడా టీజర్ రిలీజ్‌తో ఆగిపోయింది. చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో బూతు డైలాగులతో పాటు న్యూడ్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ టీజర్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల మరో సినిమా వచ్చింది. అదే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. తమిళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఇరట్టు అరాయిల్ మురట్టు కుత్తు’ అనే సెక్సీ హర్రర్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో ఆర్జే హేమంత్, అరుణ్ ఆదిత్ హీరోలుగా.. నిక్కీ టాంబోలి, భాగ్యశ్రీ మోటే సహా పలువురు సీనియర్ నటులు నటించారు. ఈ సినిమా టీజర్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేసింది.

ఇలా టాలీవుడ్‌లో సంవత్సరానికి పదుల సంఖ్యలో అడల్ట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇది చూస్తుంటూ రానున్న రోజుల్లో సెన్సార్ బోర్డు నిబంధనలు కూడా మార్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయేమో అనిపించక తప్పదు. వీటి వల్ల సమాజానికి వచ్చే లాభాలు నష్టాలు గురించి మాట్లాడుకునే ముందు నిర్మాతలకు డబ్బులు మిగులుతాయా లేదా అనేది చెప్పడం మాత్రం కష్టం. ఏది ఏమైనా టాలీవుడ్ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.