చంద్రబాబు పై తెలంగాణ సర్కార్ ఆరా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జరిగిన విషయాలపై సిఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. బీజేపీ సూచనల మేరకే ఆయన ఈ పని చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. చంద్రబాబు నాయుడు తీసుకున్న భూ నిర్ణయాల పైనే ఎక్కువగా కేసీఆర్ సర్కార్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా… ఉంటే అవి ఏవి. ఎందుకు అలా చేశారో కూపీ లాగుతోంది. ఇప్పటికే ఇదే విషయంపై అధికారులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు చర్చించుకుంటున్నారు. త్వరలోనే పలు భూ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్.జి సంస్థకు హైదరాబాద్ లోని స్టేడియంలను అప్పగించారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. దాని వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరిందనే విషయం పై ఇప్పుడు కూపీ లాగుతోంది తెలంగాణ సర్కార్. గచ్చిబౌలిలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌ సంస్థకు గోల్ఫ్‌ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టారు. దాని పైనే కాదు… ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టు మట్టులను రాబట్టాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం చెప్పారట. త్వరలోనే తమకు ఆ కేటాయింపుల పై నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసీఆర్ రంగంలోకి దిగారని..వారి చెప్పినట్లు చేస్తున్నారనేది వస్తున్న విమర్శ. కర్నాటక ఎన్నికల తర్వాత చంద్రబాబు పై కేసులు రావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు బలం చేకూరేలా కేంద్రం అడుగులు ఉంటున్నాయి. మోడీ అంత తేలికగా శత్రువును వదిలి పెట్టే రకంగా కాదు. ఏపీకి హోదా విషయంలో అన్యాయం చేస్తున్నా..ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు కాకపోయినా ఎన్నికలకు ముందు హోదా ప్రకటన చేసే అవకాశముంది. అంతే కాదు..ఏపీకి న్యాయం చేస్తామని చెప్పినా చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పే వీలుంది. వీలున్నంత వరకు చంద్రబాబును ఇరుకున పెట్టి తాము బయట పడేందుకు బీజేపీ కీలక నేతలు పావులు కదుపుతున్నారనే వాదన లేకపోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.