కేసీఆర్ కు ఎదురుతిరిగితే అంతే సంగతులు

తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. తెలంగాణలో ఎవరైనా ఎదుటి వ్యక్తిని పరుష పదజాలంతో దూషిస్తే పోలీసులు ఊరుకోరు. కోర్టులతో సంబంధం లేకుండా నేరుగా కేసు పెట్టవచ్చన్న అధికారాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫైల్ పై సంతకం చేశారన్న వార్త కలకలం రేపుతోంది. చట్టం ప్రకారం 506, 508 సెక్షన్ల కింద ఈ ఆదేశాలు చెల్లవని కొందరు పోలీసు అధికారులు చెబుతున్నా కేసీఆర్ ఊరుకోవడం లేదట. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని వదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారట. రేవంత్ రెడ్డితోపాటు.. తెలంగాణలోని చాలా మంది నేతలు కేసీఆర్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక మీదట అది చెల్లదు. కొత్త చట్టం రానుంది. 
మొత్తంగా పౌర హక్కులను కాలరాచేలా వ్యవహరించనుంది తెలంగాణ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వచ్చే వీలుంది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ రిజర్వేషన్లు కావాలని అడిగారు. అంతే ఏకంగా నెల రోజుల పాటు జైలులో పెట్టించారు. ధర్నాలకు అనుమతి లేదు. ఆందోళనలు చేయడానికి వీలు లేదు. ఎవరైనా గట్టిగా నోరు తెరిచి మాట్లాడితే అరెస్టులే. ఉస్మానియాలో విద్యార్థులను లాఠీలతో కొట్టించాడు. కోదండరామ్ ను వాడు వీడు అంటున్నాడు. గద్దర్ ను గౌరవించడం లేదు. తనకు ప్రాణ హాని ఉందని ఆయన ఏకంగా హోం శాఖ మంత్రినే కలిసి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోమటిరెడ్డి అనుచరుడు శ్రీనివాస్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం హత్య చేయించారనే ప్రచారం వస్తోంది. మొత్తంగా తనకు వ్యతిరేక గళం వినపడితే చాలు ఊరుకోడట. అందుకే చట్టంలో మార్పులు తీసుకువచ్చే పని చేస్తున్నాడు. 
మీడియా పైనా నియంత్రణ చేస్తున్నాడంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన వారిని గతంలోనే అరెస్టులు చేయించారు. అంతే ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శించకూడదు. అడగకూడదు. ఈ ప్రభుత్వం నియంత పాలనకు వెళుతుందా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. అమ్రపానీ పెళ్లి గురించి పతాక శీర్షికలు ఎందుకు.. మా ఉద్యమం గురించి రాయండని.. మంద కృష్ణమాదిగ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.