లైవ్‌లో టీవీ9ను తిట్టిన ఉత్త‌మ్ !

తెలంగాణలో మాత్ర‌మే కాదు… ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రూ అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రోజు డిసెంబ‌రు 11. తెలుగు వారంద‌రికి అతిపెద్ద ప్ర‌శ్న * 2018 తెలంగాణ‌ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది?* ఈ ప్ర‌శ్న‌కు ఎవ‌రు ఎలాంటి లాజిక్ చెప్పినా జ‌నం న‌మ్మేస్తున్నారు. దీని ఆధారంగా రేటింగ్లు, టీఆర్పీలు పెంచుకోవ‌డానికి మీడియాలు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. సంచ‌ల‌నాల‌కు మారుపేర‌యిన టీవీ9 ఈరోజు రాత్రి ఒక స‌ర్వేను ప్ర‌సారం చేసింది. అందులో టీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 104 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఆ స‌ర్వే చేసింది సెంట‌ర్ ఫ‌ర్ సెఫాల‌జీ స్ట‌డీస్ అనే సంస్థ‌. ఇటీవ‌ల టీవీ9 రామేశ్వ‌ర‌రావుకు చెందిన వ్య‌క్తులు కొన్నార‌ని, అందులోంచి రవిప్ర‌కాష్ బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని చెబుతున్నారు. అదే నిజ‌మైతే ఈ స‌ర్వేమీద నీలినీడ‌లు ఉన్న‌ట్లే.
ఇక ఈ స‌ర్వే ప్ర‌సార స‌మ‌యంలో ఒపీనియ‌న్ కోసం కాంగ్రెస్ తెలంగాణ ప్రెసిడెంట్ ఉత్త‌మ్‌కు యాంక‌ర్ ఫోన్ క‌లిపారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ టీవీ9 తీరుపై మండిప‌డ్డారు. ప్రైమ్‌టైమ్‌లో చెత్త సర్వేలు ప్రసారం చేస్తారా? అంటూ లైవ్ లోనే ఆగ్రహం వ్యక్తంచేశారు.

” ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్రసారం చేస్తున్నారు. మీరు టీఆర్ఎస్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అమ్ముడుపోయినట్లుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. మీది చెత్త ఛానెల్. టీఆర్ఎస్‌కు 100 సీట్లు రాకుంటే ఛానెల్ మూసేస్తారా? దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. ప్రైమ్‌టైమ్‌లో ఇలాంటి సర్వే చేయడం దుర్మార్గం. మీ ఛానెల్ యాజమాన్యాన్ని కేసీఆర్ ఒత్తిడి పెడుతున్నారు. ప్రజాకూటమి 85 సీట్లను సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది” అని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.