అవిశ్వాసంపై టీడీపీ దూకుడు… జ‌గ‌న్ నిస్తేజం!

వ‌ర్షాకాల పార్లమెంటు స‌మావేశాలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ నేత‌లంద‌రి దృష్టి వైసిపి పైనే ప‌డింది. రాబోయే పార్ల‌మెంటు స‌మావేశాల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌ట‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా గ‌త‌ బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌గ‌న్ పార్టీ… కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి విదిత‌మే! అప్ప‌ట్లో వైసిపి ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి బాబు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కూడా చెప్పారు. వైసిపి ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి పోటీగా చంద్ర‌బాబు కూడా ఓ తీర్మానం ప్ర‌వేశపెట్టారు. త‌ర్వాత ఢిల్లీ కేంద్రంగా ప‌లు రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో అప్ప‌ట్లో వైసిపికే మంచి పేరొచ్చింది.  అందుక‌నే చంద్ర‌బాబు ఇపుడు కాస్త ముందుగా మేల్కొన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ నెల‌ 18వ తేదీ నుండి మొద‌ల‌య్యే వ‌ర్షాకాల స‌మావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశపెట్టాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాకుండా జాతీయ స్ధాయిలో వివిధ‌ పార్టీల అధినేత‌ల‌ మ‌ద్ద‌తు కోరుతూ లేఖ‌లు కూడా రాశారు. మ‌రోవైపు వైసిపికి లోక్ స‌భ‌లో ఎంపిలు లేక‌పోవ‌టం  చంద్ర‌బాబుకు క‌ల‌సివ‌చ్చేలా ఉంది. వైసిపికి లోక్ స‌భ‌లో బ‌లం లేదు స‌రే… మ‌రి, రాజ్య‌స‌భ‌లో వైసిపి ఏం చేస్తున్న‌ద‌న్న‌ది తెలియాల్సివుంది. అక్క‌డ ఉన్న ఇద్ద‌రిలో వేనాటి ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌భ‌కు కొత్త‌. దీంతో మొత్తం భార‌మంతా విజ‌య‌సాయిరెడ్డిపైనే ప‌డింది. దీంతో వ‌ర్షాకాల స‌మావేశాల్లో స‌భ‌లో జ‌గ‌న్ పార్టీ ఎటువంటి వ్యూహం అనుస‌రిస్తుంద‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.