అవిశ్వాసంలో టీడీపీ గెలిచిందా..? ఓడిందా..?

తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కారణంతో ఎన్డీయే నుంచి బయటికొచ్చిన ఆ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మద్దతు తెలుపడంతో స్పీకర్ ఆమోదించడం.. దీనిపై చర్చించడం.. ఓటింగ్ నిర్వహించడం చక చకా జరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన అవిశ్వాసం పరీక్షలో ఎన్డీయే సర్కారే విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా.. అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఓటింగ్‌ను ఉత్సాహంతో తిలకించారు. ఎన్డీయే సర్కారుకు సంఖ్యా బలం ఉందని తెలిసినా టీడీపీ ఎందుకు అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టింది..? అసలు దీని వల్ల ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమిటి..? ఇంతకీ అవిశ్వాసంలో టీడీపీ గెలిచిందా..? ఓడిందా..? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తక మానవు.

పార్లమెంట్‌లో జరిగిన ఈ వ్యవహారాన్నంతా గమనించిన వారికి దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. ఎక్కువ శాతం మంది మాత్రం టీడీపీ అనుకున్నది సాధించిందని ప్రశంసిస్తున్నారు. కేవలం 15 మంది ఎంపీలు ఉన్న ఒక పార్టీ.. 15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి చరిత్ర సృష్టించిందని పలువురు అంటున్నారు. దేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలను తెలుగుదేశం పార్టీ కూడగట్టడం నిజంగా అద్భుతమని కొనియాడుతున్నారు. అంతేకాదు, ఓడిపోతామని తెలిసినా.. అవిశ్వాసం ప్రవేశ పెట్టి తమ రాష్ట్ర సమస్యలను దేశ వ్యాప్తంగా తెలుపడంలో టీడీపీ సక్సెస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏపీపై కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉన్నా.. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంలో మాత్రం ఆ పార్టీ ఎంపీలు విజయం సాధించారు.

కేవలం ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు ఎంపీలు అవిశ్వాసానికి వ్యతిరేకంగా 126 మందిని కూడగట్టడమే టీడీపీ సాధించిన పెద్ద విజయంగా భావించాలి. అంతేకాదు, ఏ సభలోనో, ఏ నిరసన కార్యక్రమంలోనో బీజేపీ చేసిన అన్యాయాన్ని చెబితే కేవలం ఆ ప్రాంతం వరకే పరిమితం అవుతుంది. అలాంటిది, రాజకీయ నాయకులంతా దేవాలయంలా భావించే పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడం.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించడం వల్ల దేశ వ్యాప్తంగా చలనం వచ్చిందనేది వాస్తవం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్నీంటికీ నిధులు ఇచ్చి ఉండవచ్చు.. కానీ, అవిశ్వాసం తర్వాత అందరి మద్దతు టీడీపీకే లభించేలా ఆ పార్టీ ఎంపీలు మాట్లాడారని బీజేపీలోనే ఉన్న పలువురు చర్చించుకున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.