టీడీపీ ఓటర్లు జగన్‌ను గెలిపిస్తారట!

ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపద్యంలో జగన్ పలు హామీలు ఇస్తూ ప్రజా సంకల్ప పాదయాత్రలో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ తాను వెళ్లిన ప్రతీచోటా చెబుతున్నారు. రైతులను, నిరుద్యోగులను మహిళలను చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయాయని కొందరు ఓటర్లు జగన్ తో చెబుతున్నారట.  దీంతో తన పాదయాత్రలో జగన్ పలు హామీలు ఇస్తూ, ప్రజల్లో ధైర్యం నింపుతున్నారట. రాబోయే రోజులు మంచివని,  ప్రజలందరూ ధైర్యంగా ఉండి, అబద్ధాలు మోసాలు చేసే రాజకీయ నాయకులను రాబోయే ఎన్నికలలో తరిమికొట్టాలని జగన్ తన పాదయాత్రలో ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఈ క్రమంలోనే గత ఎన్నికలలో చంద్రబాబు చేతిలో మోసపోయిన విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ వెంటే ఉంటామని స్పష్టం చేశారనేవార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర లో విశాఖలో మొదటి అడుగు వేసిన దగ్గరనుంచి విజయనగరం వరకూ జగన్ వెంటే నడుస్తామని వారు తీర్మానం చేశారట. గతంలో వైస్ రాజశేఖరరెడ్డి విశ్వబ్రాహ్మణులకు పెద్దపీట వేశారని వారు జగన్ కు గుర్తుచేశారట. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.