చంద్రన్న స్టెప్పుతో అమాంతం పెరగనున్న ఓటు బ్యాంక్!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ ఓటు బ్యాంకును ఎలా పెంచుకోవాలా? అనే కోణంలో స్టెప్పులేస్తున్నాయి. ఓ వైపు వైస్సార్ సీపీ, మరోవైపు జనసేన అధినేతలు ప్రజల వద్దకు వెళ్లి బాబుపై విమర్శలు గుప్పిస్తూ తమపై సానుభూతి వచ్చేలా నానా తంటాలు పడుతున్నారు. అయినా ఏం లాభం? బాబు పాలనా విధానం, ఆయన వేసే స్టెప్పులు, స్కీముల ముందు ఆ విమర్శలన్నీ కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు చంద్రబాబు తనకు ఇప్పటికే ఉన్న సపోర్ట్ రెట్టింపు చేసేలా కొత్త స్టెప్పులేసి ఓటు బ్యాంకును అమాంతం పెంచేసుకుంటున్నారు.

ప్రస్తుతం టీడీపీ పార్టీకి ఏపీలో అన్నివర్గాల వారి మద్దతు పుష్కలంగా ఉంది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకు పార్టీకి చాలా అడ్వాంటేజ్. మహిళలకు మేలు చేసే విధంగా  ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం ద్వారా ఏపీ మహిళా లోకం టీడీపీకి బాగా దగ్గరైంది. త‌ల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ నుంచి సీమంతం మొద‌లు.. డ్వాక్రా సంఘాల వ‌ర‌కు కూడా అనేక కార్య‌క్ర‌మాలు మ‌హిళ‌ల‌కు మేలు చేకూరుస్తున్నాయి. ఉన్న‌త విద్య‌లోనూ మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక కోటాను అమ‌లు చేస్తున్నారు చంద్రబాబు. ఉన్న‌త విద్య‌ను ఆశించి విదేశాల‌కు వెళ్లే విద్యార్థినుల‌కు కూడా ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిధులు ఖ‌ర్చు చేస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. డ్వాక్రా రుణాల మాఫీ, ప‌సుపు-కుంకుమ పేరుతో మహిళల బ్యాంకు అకౌంట్లలో నేరుగా న‌గ‌దు జమ, చంద్ర‌న్నబీమా ప‌థ‌కం.. ఇలా రకరకాలుగా మహిళలకు అండగా ఉంటున్నారు చంద్రన్న. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద దూర‌మైతే.. చంద్ర‌న్న భీమా పథకం ద్వారా ప్ర‌బుత్వం ఆయా కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తోంది. ఇన్ని చేస్తుంటే చంద్రన్నకు కాక ఇంకెవరికి జై కొడతారు ఏపీ మ‌హిళ‌లు.  

మహిళా ఓటు బ్యాంకు ఎంత దృడంగా ఉందో అర్థమైందిగా.. ఇక వృద్ధుల ఓటు బ్యాంకును గమనిద్దాం. రాష్ట్రంలో 70 ఏళ్లు పైబ‌డిన వారు 15% ఉంటార‌ని అంచ‌నా. వీరంతా కూడా మ‌ళ్లీ చంద్ర‌బాబే సీఎం కావాలని కోరుతున్నారు. 70 సంవత్సరాలు పైబ‌డిన వారికి 10శాతం అదనపు పెన్షన్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై వృద్ధులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే వృద్ధాప్య పించ‌న్‌ను అందిస్తున్న టీడీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఇలా ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని విడిచి పెట్టి వృద్ధాప్యంలో మునిగిపోయిన త‌మ‌ను ఆదుకోవ‌డం శుభ పరిణామమని పింఛ‌న‌ర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన వర్గాలంటారా? కేంద్రం సహకారం లేకున్నా బాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు జై టీడీపీ, జై చంద్రబాబు అని ఎప్పటినుంచో నినదిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే ఎలక్షన్స్‌లో బాబును బీట్ చేసే నాయకుడున్నాడా? మీరే చెప్పండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.