వైసీపీ కీలక నేతను టార్గెట్ చేసిన టీడీపీ

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. మరోసారి గత ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన స్థానాలపై ఎక్కువ దృష్టి సారించింది ఆ పార్టీ అధిష్టానం. అందుకోసమే ఈ సారి అక్కడ పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో కొన్ని నియోజకవర్గాలను ఆ పార్టీ ఇప్పటికే ఎంపిక చేసుకుందట. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ స్థానమేనని తెలుస్తోంది. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని విజయం సాధించారు. దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ పది సార్లు ఎన్నికలు జరగగా ఆ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించింది. అయితే, గత ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ హవా ఉన్నా అక్కడ మాత్రం వ్యతిరేక ఫలితమే వచ్చింది. కాబట్టి ఈ సారి అక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబుతో అన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కొడాలి నాని తెలుగుదేశం నాయకులపై, ఆ పార్టీ జెండాపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘తనను గుడివాడ నుంచి తరిమికొడతానంటున్న టీడీపీ నేతలకు రెండువందల రోజుల తర్వాత చుక్కలు చూపిస్తా… వారి రాజకీయ జీవితాలను భూస్థాపితం చేస్తా.. టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా’ అని ఆయన వ్యాఖ్యలు చేయడంతో అక్కడి టీడీపీ నేతలకు మండిపోయిందట. వెంటనే చంద్రబాబును కలిసి వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో ఎలాగైనా టీడీపీ జెండానే ఎగరాలని, అందుకోసం అవసరమైతే కఠిన నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారని సమాచారం. ఈ విషయం ఎప్పుడో చంద్రబాబు దృష్టికి వచ్చిందని, ఆయన కూడా గుడివాడపై దృష్టి సారించారని తెలుస్తోంది. గతంలో టీడీపీలో ఉన్న కొడాలి నాని వ్యక్తిగత కారణాలతో వైసీపీలోకి జంప్ అయ్యాడు. ఆ పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే కీలక నేతగా మారిపోయాడు. జగన్ తర్వాత అంత రేంజ్ ఉన్న నేతల్లో ఆయన ఒకడిగా ఉంటున్నాడు. అందుకోసమే ఆయనను ఓడించి, వైసీపీని దెబ్బకొట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.