సోష‌ల్ మీడియా టీడీపీ బ్యాక్‌.. చంద్ర‌బాబు క్లాసు!

అధినేత ఆలోచ‌న‌ను .. అర్థం చేసుకోవ‌టంలో తెలుగు త‌మ్ముళ్లు వెనుక‌ప‌డుతున్నారు. లోకేష్ చెప్పిన‌ట్లుగా ఆయ‌న వేగాన్ని అందుకునేందుకు క‌నీస ప్ర‌య‌త్నాలు చేయ‌ట్లేదు. ఎన్నిక‌ల త‌ర‌ముకొస్తున్న వేళ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో కొంద‌రు నేత‌ల తీరు.. ఓవ‌రాల్‌గా పార్టీకే త‌ల‌నొప్పిగా మారింద‌నేచెప్పాలి. అనుకూల మీడియా ఎంత‌టి పాజిటివ్‌ను జ‌నాల్లోకి తీసుకెళ్తున్నా.. ఒక్క పోస్టుతో అదంతా గంగ‌పాలు చేసేంత‌గా సోష‌ల్ మీడియా చెల‌రేగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే రాజ‌కీయ పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారినా. ఆయుధంగా మారినా. అదంగా సోష‌ల్ మీడియాకే చెల్లింది.

వైసీపీ ఈ విష‌యంలో ప‌ద‌డుగులు ముందే ఉంద‌నాల్సిందే. ప్ర‌వాస తెలుగు  అభిమానులు, వ‌ర్గ‌ప‌ర‌మైన వ్య‌క్తులు వైసీపీను త‌ద్వారా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని బాగానే పాపుల‌ర్ చేసే ప‌నిలో ఉన్నారు. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మండ‌ల‌స్థాయి వ‌రకూ సోష‌ల్ మీడియా కో-ఆర్డినేట‌ర్స్ అంటూ వైసీపీ ప‌రోక్షంగా ఫండింగ్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యంలో అధికార టీడీపీ మాత్రం చాలా వెనుకంజ‌లో ఉంద‌ట‌. దీనిపై స్వ‌యంగా చంద్ర‌బాబునాయుడు త‌మ్ముళ్ల‌కు క్లాసు తీసుకున్నార‌ట‌. ఎందుకంటే.. టీడీపీ, బీజేపీ దోస్తీ క‌టీఫ్ అయిన‌ప్ప‌టి నుంచి బీజేపీ టీడీపీను అవినీతి మ‌యం అనే ముద్ర వేసేందుకు నానా తంటాలు ప‌డుతుంది.

 

మ‌రోవైపు కేంద్రంలో మాట చెల్లుబాటుకాని నేత‌గా చంద్ర‌బాబును వైసీపీ, కాంగ్రెస్‌లు ఎండ‌గ‌డుతున్నాయి. అది కూడా కేవ‌లం సోష‌ల్ మీడియా లో భాగ‌మైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ద్వారానే. ఇవ‌న్నీ ఓట‌ర్ల మీద ప్ర‌భావం చూపేవి. ఎందుకంటే. గ‌తంలో మౌత్‌టాక్‌తో ఒక‌రి భావాలు ఒక‌రు పంచుకున్నారు. త‌ద్వారా.. ఓట‌ర్లు తాము ఓటేయాల్సిన నేత మంచిచెడులు.. పార్టీల బ‌లాబ‌లాల గురించి అంచ‌నాకు వ‌చ్చేవారు. కానీ.. ఇప్పుడు ఎదురుగా వున్నా ఫోన్ల‌లోనే మాట్లాడుకోవాల్సిన దుస్థితి. అందుకే.. అందుబాటులో ఉన్న ఫేస్‌బుక్ ప్ర‌చారానికి వేదిక‌.. ఎవ‌ర్ని తిట్టినా.. పొగిడినా.. చివ‌ర‌కు గాలివార్త అయినా.. క్ష‌ణాల్లో కోట్లాదిమందికి చేరే ఛాన్స్ దీనిద్వారానే సాధ్యం. కొంద‌రు నేత‌లు నెల‌కు దీనిపై ల‌క్ష‌లు ఖ‌ర్చుచేస్తున్నారు. ఈ విష‌యంలో హైటెక్ సీఎంగా పేరున్న చంద్ర‌బాబు పార్టీనే వెనుక‌బ‌డి ఉండ‌టాన్ని బాబు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నార‌ట‌. దీంతో.. సోష‌ల్ మీడియా గ్రూపును బ‌లోపేతం చేసి.. బ‌ల‌మైన కౌంట‌ర్ల‌కు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి టీడీపీ ప‌థ‌కాల‌ను తీసుకెళ్లాలంటూ ఆదేశించార‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.